Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

414

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


త్వము వారవలంబింపవలసిన తీవ్రనిర్బంధనవిధానమునుగూర్చిన వివరములుగల ప్రణాళిక నొకదానిని ప్రకటించిరి.

బ్రిటీషుప్రభుత్వమువారు తమ అభిప్రాయములను స్పష్టీకరింపక అప్పటి కా రెండవ రౌండుటేబిల్ సభను ముగించిరి. 1931 డిశెంబరులో గాంధిమహాత్ముడు వెనుకకు తిరిగివచ్చెను. ఈలోపున ఇంగ్లాండుదేశమున కన్సర్వేటివ్ ప్రభుత్వము రాజ్యములోనికి రాగానే, విల్లింగ్డన్ ప్రభువు యూరపియను సంఘమువారి సలహాప్రకారము కాంగ్రెసు నణచివేసి శాశ్వత కీర్తినిగడింపదలచెను. అందువలన మహాత్ము డింకను స్వదేశమునకుమరలిరాకమునుపే ఈవిల్లింగ్డన్ నిర్బంధ విధానములను ప్రయోగించుట మొదలిడెను. సంయుక్త రాష్ట్రములయందు జవహర్లాలు నాయకత్వమున పనిచేయుచుండిన కిసానులును, పశ్చిమోత్తర పరగణాలందు ఖా౯ అబ్దుల్ గఫూరుఖాను నాయకత్వమున పనిచేయు చుండిన ఖుదాయి కిద్మత్ గార్లును, కాంగ్రెస్‌కు మూలబలములై యుండుట చూచి ముందుగా వీరిపైన నితడు తన నిషేధపు టుత్తరవులు జారీచేయసాగెను. అంతటితో తృప్తి జెందక ఆ రెండురాష్ట్రములలోను తీవ్రనిర్బంధవిధానములతో ఆర్డినెన్సులను శాసించెను. వంగరాష్ట్రమున దారుణవాదుల నణచుట కను నెపమున తీవ్రమైన నిర్బంధవిధానములతో నింకొక ఆర్థినెన్సును శాసించెను. మహాత్ముడు దేశములో అడుగు పెట్టునప్పటికి జవహర్లాలును, ఖా౯ అబ్దుల్ గఫూర్ ఖా౯ను అరెస్టు చేయబడిరి. విల్లింగ్డన్ ప్రభుత్వము నిర్హేతుకముగా కాంగ్రెసుపైన దాడివెడల దలచెనని స్పష్టమయ్యెను. గాంధీమహాత్ముడు