పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెస్ అజ్ఞాతవాసము

413


లేబరుప్రభుత్వములో ప్రధానామాత్యుడుగా నుండిన రామ్శే మేక్డానాల్డు పేరునకు ప్రధానామాత్యుడుగా నిలువబడెను. గాని అతడు కన్సర్వేటివ్ నాయకులకు దాసుడయ్యెను.

గాంధీమహాత్ముడు ఇంగ్లాండునకు పోవుటకు ముందుగానే భారతదేశములో ఇర్విను ప్రభువుకు బదులుగా విల్లింగ్డన్ ప్రభువు వైస్రాయిగా నియమింపబడెను. ఇతడు నిరంకుశ సామ్రాజ్య తత్వవాది. గాంధీ - ఇర్విను రాజీనామా బ్రిటిషువారి పరువుప్రతిష్ఠలకు భంగకరమని నమ్మువారిలో నితడొక్కడు. అందువలన ఆ రాజీనామాషరతులప్రకారము ప్రభుత్వోద్యోగులు పనులు జరుపుటలేదని కాంగ్రెసు మహాసభవారు చేసిన ఫిర్యాదుల నితడు పెడచెవిని బెట్టి నిరంకుశముగా వర్తించుచుండెను. ఇతని తాబేదారులు నీతనియభిమతానుసారముగా నిరంకుశులై ప్రవర్తించుచుండిరి. ఇందువలన గాంధిమహాత్ముడు తుదివరకు ఇంగ్లాండుకు పోవునను నమ్మకమే లేదు. ఆయన ఇంగ్లాండులో అఖండగౌరవము లందుచుండగా గాంధీమహాత్మునికిని కాంగ్రెసునకును ఇంత పలుకుబడి, పరువుప్రతిష్ఠలు గలుగుట, భారతదేశములోని ఆంగ్లేయోద్యోగులకు బ్రిటీషు వర్తకులకు సహింపరానిదిగా నుండెను. అంతట యూరపియన్ సంఘమువారు కాంగ్రెసు కిట్లు ప్రభుత్వము లొంగిపోవుట బాగుగ లేదనియు, కాంగ్రెసు గర్వము మితిమీరుచున్నదనియు, ఇక ముందు సందు దొరికినప్పుడు కాంగ్రెసుయొక్క బలమును పూర్తిగా అణగద్రొక్కి లేవలేనట్లు చేయవలెననియు ప్రబోధము చేయుచు, ప్రభు