Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీసత్యాగ్రహము - ఇర్విన్‌సంధి

409


చనలుచేయుట కని చెప్పి లండనులో నొక 'రౌండు టేబిలు'సభ నేర్పాటుగావించి ప్రభుభక్తిపరాయణులగు భారతీయులను కొందరనాహ్వానించి వేనకువేలుఖర్చుపెట్టి తాము నియమించినవారిని ఓడలలో తీసికొనివెళ్ళిరి. కాంగ్రెసువారు లేనిదే యీరౌండుటేబిలు సభచేయు తీర్మానముల కెట్టి విలువయు నుండదని బ్రిటిషుప్రభుత్వమువా రెరుగుదురు. కాని పట్టుదలకొరకు అది జరిపితిమని యనిపించుకోదలచిరి. ఆ సభయందు జరిగిన కార్యకలాపములు, చర్చలు, అందలి కార్యక్రమములు అన్నియు బ్రిటిషురాజనీతిజ్ఞు లాడించినట్లే జరిగినవి. ఎట్టకేలకు బ్రిటిషు ప్రధానామాత్యుని ఆశీస్సులతో నాసభ ముగిసెను. రౌండుటేబిలు సభవారు భరతవర్షమునకు, కొన్ని మినహా యింపులతోను రక్షణలతోను బాధ్యతాయుత స్వపరిపాలనా రాజ్యాంగ మేర్పాటు చేయవలయుననియు, రాజ్యాంగము స్వరూపమున ఫెడరల్ విధానమునకు జెందినదిగా నుండవలయు ననియు అట్టి ప్రకటనను బ్రిటిషుప్రభుత్వమువారు గావింప వలయుననియు తీర్మానించిరి. “మార్పుదల కాలమున పూచీ పడవలసిన కొన్ని సందర్భములకు వలసినట్టియు కొన్ని ముఖ్యపరిస్థితుల కావశ్యకములైనట్టియు ఏర్పాటులతోను మరియు అల్పసంఖ్యాకజనముల రాజకీయ స్వాతంత్ర్యములను గాపాడుటకు వలసిన పూచీలతోను భారతదేశప్రభుత్వముయొక్క బాధ్యతను ఆదేశ కేంద్రరాష్ట్రీయ శాసన సభలయందు నెలకొల్పుట యుక్తమని బ్రిటిషుసామ్రాజ్య ప్రభుత్వమువారి యభిప్రాయము.”