408
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
11. స్వసంరక్షణకొరకు ఆయుధము లుంచుకొనుటకు అనుమతి పత్రములిచ్చుట.
ఈ ముఖ్య సంస్కరణములు గావింపుడని మహాత్ముడు బ్రిటిషుపభుత్వమువారిని కోరి విఫలుడై తన సత్యాగ్రహ మహాస్త్రమును బ్రయోగించి శాంతిసమర మారంభించెను. 1930 సం|| మార్చి 12 వ తేదీన మహాత్ముడు 'ఉప్పు - సత్యాగ్రహము” చేయ బయలుదేరి ఏప్రియల్ 6 వ తేదిన దండి గ్రామమున ఉప్పు- చట్ట తిరస్కారముజేసి శాసనోల్లంఘనము ప్రారంభించెను. మనదేశమునం దమితోత్సాహము కలిగెను. ఈ సత్యాగ్రహమున వేనకువేలు ప్రజలు పాల్గొనిరి. ప్రభుత్వమువారు తీవ్రనిర్బంధవిధానమును ప్రారంభించిరి. దేశముకొరకు బాధలందు నవీనపద్ధతితో శాంతిసమరము జరిగెను. 60 వేల మంది చెరకేగిరి. ఆగర్భశ్రీమంతులు ఘోషాస్త్రీలు కూడ ఉద్యమమందు పాల్గొని కష్టము లనుభవించిరి. కేంద్రశాసన సభాధ్యక్షుడగు విఠల్‌భాయిపటేలుగారుగూడ రాజీనామా నిచ్చి చెరకేగిరి. బ్రిటిషు వస్త్రబహిష్కారము జయప్రదముగా జరిగి బ్రిటిషువారి వర్తకము పడిపోయెను. ఈ సంగతి సత్యమని 1935 లో టారిఫ్ బోర్డుయెదుట సాక్ష్యమిచ్చిన లంకాషైరు వర్తకప్రతినిధులు ఒప్పుకొనిరి.
IV
మొదటి రౌండుటేబిలు సభ.
కాంగ్రెసువారు జైళ్ళలో మ్రగ్గుచుండగా బ్రిటీషుప్రభుత్వమువారు రాజ్యాంగ సంస్కరణములనుగూర్చి ఆలో