గాంధీసత్యాగ్రహము - ఇర్విన్‌సంధి
407
ములు కాంగ్రెసుపుట్టినదాది కోరబడుచున్న సంస్కరణములే. అవి యెవ్వియన.
1. త్రాగుడు పూర్తిగా నిషేధించుట.
2. రూపాయికి ఒకషిల్లింగు నాలుగు పెన్నీలుగ మారకపు విలువను తగ్గించుట.
3. భూమిపన్నులో నూటికియేబదివంతులు తగ్గించుట. పన్నులను వృద్ధిచేయు నధికారమును శాసనసభల కిచ్చుట.
4. ఉప్పుపైన పన్ను తీసివేయుట.
5. సైన్యము కొరకు చేయుచున్న దుర్వ్యయములో సగము వెంటనే తగ్గించుట.
6. ప్రభుత్వోద్యోగుల వేతనములు సగమునకు కాని, దేశాదాయమునకు తగినట్లుగా ఇంకను తక్కువకుగాని తగ్గించుట.
7. విదేశవస్త్రముల పైన పన్నువిధించుట.
8. భరతఖండతీరములందలి నౌకావ్యాపారమును గూర్చి ప్రజాప్రతినిధులు చేయగోరినచట్టము నంగీకరించుట.
9. హత్యచేసినట్లుగాని చేయ ప్రయత్నించినట్లుగాని కోర్టువారు తీర్మానించినవారిని తప్ప తక్కిన రాజకీయనిర్బంధితుల నెల్లరను విడుదలచేసి, ద్వీపాంతరవాసము చేయువారిని భరతఖండమునకు రానిచ్చుట.
10. రహస్యరక్షక (సి.ఐ.డి) శాఖవారిని రద్దుచేయుట లేక ప్రజాప్రతినిధులకు లోబరచుట.