బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
19
దిన వెచ్చములకు పోరాడుసైనికులు కొందరు రోహిలుఖండము నాక్రమించిరి. యమునానదీతీరములందు జాబురాజపుత్రులు విజృంభించిరి. భరతఖండమున పశ్చిమతీరమున, భరతఖండము నేకచ్చత్రముగ నేలదలచినవారి నెల్లర ధిక్కరించి బ్రిటిషువారితోకూడ నెన్నో ఘోరయుద్ధములుచేసి బ్రిటిషువారి యదృష్టవశమున తుదకు లొంగిన వీరాతివీరుల (మహారాష్ట్ర) జాతి ఔరంగజేబు కాలములోనే బయలు దేరెను. ఔరంగజేబుని యనంతర మాతని సామ్రాజ్యమునందెల్ల మహారాష్ట్రుల పేరుమ్రోగెను. ఈ జాతి మొగలాయిరాజప్రతినిధుల ననేకుల నడచివేసెను. దక్షిణ భరతఖండమునెల్ల వీ రాక్రమించిరి. పూనాలో, గ్వాలియరులో, గుజరాతులో, బీహారులో మహారాష్ట్రనాయకులు పాలింపసాగిరి. అప్పుడప్పుడు చుట్టుపట్లకు మరాటీదండ్లు వచ్చి గ్రామములను కొల్లగొనుచుండెను. ఈ దాడులను జూచి భయపడి కర్షకులు గ్రామములు వదలి యరణ్యముల కేగుచుండిరి. పెక్కు పరగణాలు వీరికి కప్పములుగట్టి వీరిబాధ తప్పించుకొనసాగెను. పేరునకు మాత్రము చక్రవర్తి బిరుదమును ధరించిన మొగలు వంశీకుడగు నిర్భాగ్యుడుకూడ వీరికి లంచ మిచ్చుకొనవలసివచ్చెను. ఈ మరాటీదండు ఢిల్లీ కోటగోడలకు దగ్గరగనే విడిసెను. ఇంకొకదండు ఏటేటను బంగాళాదేశమునందలి సేద్యపు భూములలో విడియుచుండెను. ఐరోపావర్తకు లీ మరాటీదండులవలన తమగిడ్డంగుల కే ముప్పుగల్గునో యని వణకుచుండిరి.
హిందుదేశమున మొగలాయి రాజప్రతినిధు లెచ్చోట