పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

402

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నిర్దేశ పత్రములో “మా యధినివేశరాజ్యములందు. భరతఖండము తన యర్హస్థానమును పొందుటకుగాను సామ్రాజాంతర్భాగమగు రాజ్యముగ వృద్ధిక్రమానుగుణమైన బాధ్యతాయుత స్వపరిపాలన సిద్దికొరకు పార్లమెంటువారు సూచించిన విధానములు పరిపూర్ణత్వము నందుటయే మా యభిమతము" అనియు ఉదాహరింపబడినది.

అందువల్లభారతదేశమున కెన్నటికైనను అధినివేశస్వరాజ్యము డొమినియన్ స్టేటసు సిద్ధింపగలదని భారతదేశ రాజకీయనాయకులలో మితవాదులూరట లూరుచుండిరిగాని వీరియాశలు నిరాశలగునట్లు బ్రిటీషుసామ్రాజ్య రాజనీతిజ్ఞులలో చాలమంది భారతదేశ రాజ్యాంగ పరమావధి డొమినియన్ స్టేటసు కాదనియు ఇంకేదోయొకవిధమగు బాధ్యతాయుత స్వపరిపాలనము లేక రెస్పాన్సిబిల్ గవర్నమెంటు మాత్రమేయనియు వెల్లడింపసాగిరి !

II

సైమన్ కమిటీ భాగవతము.

భారతదేశము రాజ్యాంగచక్రము ఎట్లు తిరుగుచున్నదో పది సంవత్సరములైనపిదప విచారించి తరువాత తా మింకనేమైనను సంస్కరణములు ప్రసాదింప దలచినదియు లేనిదియు నిర్ణయింతుమని 1919 చట్టము చేసినప్పుడే బ్రిటీషు పార్లమెంటువారు ప్రకటించి యుండిరి. ఎట్టకేలకు ఆతరుణము వచ్చినది. భారతదేశ రాజకీయములనుగూర్చి విచారించి తమకు నివేదించుటకు " సైమనువిచారణసంఘము" ను నియమించిరి.