గాంధీసత్యాగ్రహము - ఇర్విన్‌సంధి
401
దేశమునకు గూడ ఎప్పటికైనను డొమినియను స్టేటసు ఒసగ బడునని రాజకీయ నాయకులు చాలామంది తలంచుచుండిరి. “భరతఖండము సామ్రాజ్యాంతర్భాగముగ బాధ్యతాయుత స్వపరిపాలనము పొందుటకొరకు స్వపరిపాలన సంస్థలను క్రమక్రమముగ నెలకొల్పి యభివృద్ధిజేయుటయు భారతీయ ప్రభుత్వముయొక్క అన్ని శాఖలలోను భారతీయులు పాల్గొనుట కవకాశమిచ్చుటయు పార్లిమెంటువారి యుద్దేశమైనందునను, వృద్ధిక్రమానుగుణములగు మజలీలప్రకారమే ఈయుద్దేశమును నెరవేర్చుట యుక్త మైనందునను, అందుకొరకు కొన్ని ఏర్పాటులిప్పుడు గావింపవలయును. ఎప్పు డెప్పు డేయే విధముగ అభివృద్ది గావింపవలయునో పార్లమెంటువారే నిర్ణయింతురు. ఏలన, భారతవర్ష ప్రజలయొక్క క్షేమాభివృద్ధిభారము పార్లిమెంటు పైనే గలదు. ఈక్రొత్త యవకాశము లెవరికి కలుగ జేయబడుచున్నవో ఆ ప్రజల సహకారమును బట్టియు బాధ్యతలను నిర్వహించుటయందు వారికిగల శక్తిని బట్టియు పైన చెప్పబడిన విషయములను పార్లిమెంటువారు నిర్ణయింతురు.
భరతఖండమునందలి పరగణాలలో స్వపరిపాలనా సంస్థలు వృద్ధిచేయబడిన కొలదియు కేంద్రప్రభుత్వముయొక్క ప్రభుత్వకర్తవ్యములకు భంగకరములు కాకుండగ సాధ్యమైనంత హెచ్చు స్వాతంత్ర్యములు పరగణాల కీయబడును” అని 1919 సంవత్సరములో పార్ల మెంటువారు చేసిన ఇండియా రాజ్యాంగ చట్టమునందే వివరింపబడి యున్నది. ఆ రాజ్యాంగ చట్టమును బట్టి బ్రిటీషు సార్వభౌముడు భరతఖండ వైస్రాయికంపిన రాజ