Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

400

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నాటి ఐరోపాసంగ్రామశాంతిని గూర్చిన సంధిసభలోగూడ భారతదేశప్రతినిధులు పాల్గొని సంధిపత్రముపైన సంతకము చేయుటయు 1919-21-23-1926 సంవత్సరములందు జరిగిన సామ్రాజ్యసభలందు పాల్గొనుటయు జరిగినందున భారత దేశమున కొక విధమగు అంతర్జాతీయ వ్యక్తిత్వమును గౌరవమును కలుగుట తటస్థించినది. బ్రిటీషు సామ్రాజ్యములో నింగ్లాండుకును, తక్కిన అధినివేశరాజ్యములకును గల సంబంధములు సామ్రాజ్యసభలందు చర్చింపబడు చుండెను. ఆ సందర్భమున సామ్రాజ్యమునందలి కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఐరిషుఫ్రీస్టేటు మొదలగు తక్కిన అధినివేశరాజ్యములు భాధ్యతాయుత స్వపరిపాలనమును ప్రజాప్రభుత్వ పద్దతులను కలిగి యుండుటయు వానికిగల గౌరవమును వెల్లడి యగుచుండెను. ఇట్టి స్థితిలో 1926 వ సంవత్సరమున జరిగిన సామ్రాజ్యసభలో నింగ్లాండుకు తక్కిన అధినివేశ రాజ్యములకుగల పరస్పరసంబంధముల విషయమున నొక తీర్మానము చేయబడి "అధినవేశరాజ్యములు తమ ఆంతరంగిక వ్యవహారములందుగాని విదేశవ్యవహారములందుగాని ఒకదాని కింకొకటి లోబడక సామ్రాజ్యమున బ్రిటీషుదీవులతోపాటు సరిసమానములగు స్వతంత్రజనసమూహములే"యనుసూత్ర మంగీకరింపబడెను. ఇందువలన భారతీయులకుగూడ కొంతయాశగలిగెను.

1919 సంవత్సరములో పార్లమెంటువారు శాసించిన , ఇండియా రాజ్యాంగ చట్టపీఠికలో భారతదేశ రాజ్యాంగ పరిణామముగా వారు చెప్పియున్న సంగతులను బట్టియే భారత