పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాంటేగూ సంస్కరణల నాటకము

397


స్వతంత్ర శక్తులుండును? గవర్నరుతోను పరిపాలకవర్గముతోను కలిసి మెలసి మెలగవలసిన మంత్రు లాయన నాశ్రయింతురేగాని శాసనసభలలోని ప్రజాప్రతినిధుల యభిప్రాయమునేల మన్నింతురు? ఇట్టివిధానము ప్రజల కేయుపకారము చేయలేకపోవుటలో నాశ్చర్యములేదు.

ధర్మపరిపాలనావిధానము జూచినచో నిరంకుశ పరిపాలకవర్గమువారు ప్రజలహక్కుల నణచివైచుచు జేసిన వివిధ శాసనము లింక నమలులోనే యుండెను. వీనిని పురస్కరించుకొని న్యాయాధిపతియు ప్రభుత్వతాబేదారునగు మేజిస్ట్రేటు ప్రజలను గడగడలాడించును. దేశమున అమలులో నుండిన రాజ్యాంగధర్మములను, శాసనములను బట్టి ఉన్నతన్యాయస్థానములు ప్రజలను రక్షించి ధర్మము పరిపాలింప జాలవను సంగతి గూడ రాజకీయ కేసులలో వెల్లడియయ్యెను. భారతదేశమునకు నిజమైన స్వపరిపాలనము నొసగుట బ్రిటీషువారికి నష్టకరము గనుక అట్టిది యొసగుటకు వారిష్టపడక మాంటేగూ రాజ్యాంగమును నిర్మించి యుండి ఒక కపటనాటకము నాడుచుండిరని వారి చర్యలవల్లనే స్పష్టపడినది.

III

కాంగ్రెసుస్వరాజ్యపక్షమువారు శాసనసభయందు అత్యద్భుతముగా పనిచేసి దేశములో గొప్ప సంచలనము కలిగించి జాతీయోద్యమమునకు తోడ్పడిరి. 1919 రాజ్యాంగము రాష్ట్రములో నిర్మించిన ద్వంద్వపరిపాలనము సక్రమముగా నడుచుట లేదు గనుక వెంటనే అధినివేశస్వరాజ్యము స్థాపించుటకు