396
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
నుండెను కాని ఆచరణమున నీమంత్రులు గవర్నరుకును, ఆయన పరిపాలకవర్గమునకును లోబడవలసినవారై ప్రజాప్రతినిధుల యభిమతానుసారముగ ప్రవర్తింపలేకుండిరి. ఏలన మంత్రుల వశము చేయబడిన శాఖలకు వలసిన ధనసంచయమెల్ల గవర్నరు పరిపాలనమునందే యుంచబడినది. ఆదాయవ్యయ ప్రణాళికయు నాయనచేతిలోనే యుండెను. ఆయన కార్యనిర్వాహక వర్గమువారు మంత్రుల యభిప్రాయములను వృధ సేయగలుగుచుండిరి.
మంత్రులవశము చేయబడిన శాఖలందు సైతము ప్రాణాధారభాగములెల్ల గవర్నరు, పరిపాలకవర్గమువారి వశముననే యుంచబడినవి. అభివృద్ధిశాఖామంత్రికి అడవులపైన నధికారములేదు. పరిశ్రమల శాఖామంత్రికి కర్మాగారములపైనగాని, విద్యుచ్ఛక్తిపైనగాని, యంత్రములపై గాని, కార్మికులకు సంబంధించిన ఇతర విషయములందుగాని ఆవంతయు పలుకుబడిలేదు! వ్యవసాయమంత్రికి సాగుబడి, నీటిపారుదలపైన నధికారములేదు. ఇట్టి అధికారశూన్యులగు మంత్రులను నెలకొల్పుటలో బ్రిటీషువారి యుద్దేశ్యము గూఢముగ నున్నది. ఈ మంత్రుల యశక్తతనుగూర్చి కొన్నాళ్లు చెన్నపురిమంత్రిగనుండిన శ్రీ కూర్మావెంకటరెడ్డినాయుడుగారు 1923 లో ఒక ఉపన్యాసమున వెల్లడించియున్నారు. మనమంత్రుల యవస్థ ఇంతటితో తీరలేదు. వీరిక్రింద కార్యదర్శులుగ ఆంగ్ల ఐ. సి. ఎన్. ఉద్యోగులు నియమింపబడి, వారు గవర్నరు పరిపాలకవర్గమువారి వశముననే యుండిరి. ఇట్టితరి మంత్రులకేమి