మాంటేగూ సంస్కరణల నాటకము
393
వ్యయము నత్యధికముగనే యుండెను. ఐరోపాసంగ్రామసమయమున తాత్కాలికముగ విధింపబడిన హెచ్చు పన్నులు చాలవరకు తగ్గింపబడక యట్లే యుంచబడినవి. అంతటితో పోవక క్రొత్తపన్నులు విధింపబడసాగెను. 1930 లో 5 1/2 కోట్ల రూపాయలక్రొత్తపన్నులు విధింపబడెను. పూర్వముకన్న భారతీయులకు ఉద్యోగము లధికముగ నొసగబడుచున్నను నేటికిగూడ గొప్పగొప్ప వేతనములుగల యుద్యోగములెల్ల బ్రిటీషువారివే. వేతనములు తగ్గింపుడని ఎన్నివిధములుగ మొఱపెట్టినను తగ్గింపబడలేదు. మారకమును తమ యిచ్చవచ్చినట్లు నిర్ణయించి నందువలన 1900 మొదలు 1929 వరకును భారత దేశమునకు 140 కోట్లరూపాయిలు నష్టము వచ్చినది. చివరకు రూపాయికి 16 పెన్నీలుగ నుండిన మారకమును 18 పెన్నీలకు పరిపాలకవర్గమువారు హెచ్చింపదలపగ శాసనసభలోని ప్రజా ప్రతినిధులు పోరాడిరి గాని పరిపాలకవర్గము బలవంతముగ నా తీర్మానమును ముగ్గురి సమ్మతులతో గెలుపొందింప జేసిరి. దీనివలన నష్టము కలుగుచున్నదని ఎందరు మొరపెట్టినను పరిపాలకవర్గము పెడచెవిని బెట్టిరి. తుదకు పరిపాలకవర్గమువారి నిరంకుశబలము 1930 సంవత్సరఫు ఆర్థికచట్టమున మఱియు విదిత మయ్యెను. సామ్రాజ్య లాభవిధానము ననుసరించి విదేశవస్త్రములపై నధిక సుంకమును, బ్రిటీషు సామ్రాజ్య వస్తువులపైన తక్కువ సుంకములను విధించు ప్రణాళికను తయారుచేసి అసెంబ్లీ సభలో ప్రవేశపెట్టిరి. ప్రజా ప్రతినిధులు స్వదేశ పరిశ్రమల సంర