392
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
పాలకవర్గము నసెంబ్లీ సభవారు తీసివేయజాలరు. అందువలన వారికి ప్రజాభిప్రాయమువలన భయములేదు. నూటనలుబదిమందిగల అసెంబ్లీ సభయందు నలుబదిమంది పరిపాలకవర్గమువారి ఉద్యోగులు, నియామకులునై యుండిరి. ఈ తాబేదారుల సమ్మతులుగాక, పరిపాలకవర్గము తన యధికారమువలన, ప్రాపకమువలన ప్రజాప్రతినిధులలో నుండి తన వైపునకు ద్రిప్పుకొనగలవారి సమ్మతులును గలసినచో పరిపాలకవర్గము తన యిచ్చవచ్చిన విషయములెల్ల అసెంబ్లీ సభవారిచేత తీర్మానింప జేయగలుగుటకు వీలగుచుండెను. అట్లే ప్రజల కత్యంతావశ్యములగు సంస్కరణములు, సహాయములను నిరాకరింపజేయ గలుగుచుండెను. అసెంబ్లీసభయందు తనకుగల బలమువలన పూర్వము బ్రిటీషువారి లాభము కొర కీ పరిపాలకవర్గ మెన్నివిధములుగ తోడ్పడుచుండెనో ఈనాడు నన్నివిధములుగ తోడ్పడ గలుగుచుండెను. కొన్ని విషయములందు పూర్వముకన్న నధికముగ తోడ్పడ గలుగుచుండెను. రాజప్రతినిధికి గూడ కొన్ని నిరంకుశాధికారము లివ్వబడెను. ఇట్లు 1923లో ఉప్పుపన్ను వలదని అసెంబ్లీవారు త్రోసివేయగా రాజప్రతినిధి దానిని సర్టిఫికేషనుచేసి పన్ను విధించినాడు. పరిపాలకవర్గమువారు ప్రజల కపకారము చేసినప్పుడుగూడ శాసనసభలోని ప్రజాప్రతినిధు లేమియు చేయలేక పోవుచుండిరి.
ఈసంస్కరణ రాజ్యాంగము వచ్చినపిదప గూడ పరిపాలకవర్గమువారు చేయు సివిలుపరిపాలన వ్యయము సైనిక