పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాంటేగూ సంస్కరణల నాటకము

391


శాసనసభలందు ప్రవేశించి నూతన రాజ్యాంగ ప్రభుత్వ విధానమును భగ్నము చేయదలచిరి. శాసనసభలో వీరికి బలము చేకూరెను. మాంబేగూ రాజ్యాంగవిధాన మెంత బూటకమైనదో వెల్లడింపసాగిరి.

ఐదవ ప్రకరణము.

మాంటేగూ సంస్కరణల నాటకము

I

మాంటేగూ రాజ్యాంగసంస్కరణలయొక్క పరిపాలనా విధానములోని లోపములను మననాయకులు, ఉద్యోగులును కూడ చాలమారులు నిరూపించి యున్నారు. ఎన్ని లోపములున్నను రాజ్యాంగధర్మనిర్వహణమున పరిపాలకవర్గ ముదారబుద్ధితో మెలగునెడల ప్రజలకు, కొంతగాకసోయిన గొంత వరకైన, లాభ కారిగ నుండియుండునుగాని మన కట్టి భాగ్యము కలుగలేదు..

రాజ్యాంగ విధానమునందు ప్రజాభిప్రాయమును వృధసేయగల అనియంత్రణ నిర్నిరోధ నిరంకుశాధికారములు గవర్నరు జనరలుకుండెను. ఈశక్తుల నాత డుపయోగించినను, ఉపయోగింపక పోయినను సాధారణ పరిపాలనమునందు గూడ ప్రజాప్రతినిధుల శాసనసభవారి యభిమతమును ద్రోసిపుచ్చి ప్రభుత్వవర్గము తమ యిచ్చవచ్చినట్లు పరిపాలింప గల సందర్భములు నా పరిపాలనావిధానమునం దుండెను.

కార్యనిర్వాహకవర్గము అసెంబ్లీసభకు బాధ్యతవహింపని నిరంకుశ పరిపాలకవర్గముగ నుండెను. మఱియు నీపరి