పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

390

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మును సాగించిరి. ఇరువదినాల్గువేలమందిని పైగా చెరకంపిరి. దేశములో గొప్పసంచలనము కలిగెను. అప్పుడు బొంబాయ గవర్నరుగానుండిన సర్‌జార్జిలాయిడ్ 'కొద్దిలోతప్పిపోయినదిగాని మహాత్ముని యుద్యమము సఫలతగాంచి యుండెడిదే'యని తరువాత అంగీకరించినాడు. మహాత్ముని యుద్యమమందు శ్రీమంతులు,బీదవారు, స్త్రీలు, పురుషులు, త్యాగముజేసి చెరకేగి బాధలనుభవించిరి. చిత్తరంజనుదాసు, నెహ్రూ, మోతీలాలు, ప్రకాశం, రాజగోపాలచారిగార్లవంటి గొప్ప న్యాయవాదులు ఆనాడే తమవృత్తిని త్యజించి జైలుకేగిరి. కొంద రుద్యోగములుమానిరి. శాసనసభలు బహిష్కరించిరి. బిరుదులు త్యజించిరి. విద్యార్థులు పాఠశాలలు: వదలిరి. మాంటేగూ సంస్కరణల శాసనసభలకు జరిగినఎన్నికలు బహిష్కరింపబడెను. 3 వ వంతు మందికూడ ఓటుచేయలేదు. అహింసాపద్దతులతో శాంతిసమరముచేయుపద్ధతి భారతదేశమునకు క్రొత్తది. మహాత్ముని యుద్యమ మిట్లు జరుగుచుఁడగా మలబారులో మాప్లా తిరుగుబాటును ఆంధ్రదేశపు రంప ప్రదేశములందు అల్లూరి సీతారామరాజుగారి విప్లవోద్యమమును - స్వాతంత్ర్యముకొరకు చేయబడిన ప్రయత్నములు - తలలెత్తి ప్రభుత్వము వారిచే ఘోరముగా అణచి వేయబడెను.

ఈలోపుగా మాంటేగూ షెమ్సుఫర్డు సంస్కరణల రాజ్యాంగము అమలులో పెట్టబడెను. చిత్తరంజనదాసు మోతీలాల్‌నెహ్రూ ప్రభృతులు జైళ్ళనుంచి వచ్చినపిదప తీవ్రముగా ఆలోచించి కాంగ్రెసులో స్వరాజ్యపక్షమును స్థాపించి