పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖూనీబాగ్

389


త్మునికి మనస్తాపమును విషాదమును కలిగి బ్రిటీషుధర్మమునందు నమ్మకము పోయి ఆయన సహాయనిరాకరణము చేయనిశ్చయించెను. 1920 సెప్టెంబరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెనులో నీపరిస్థితులెల్ల చర్చింపబడి నూతన రాజ్యంగము తిరస్కరింపబడి రౌలటు చట్టమును రద్దు పరచుటకు ఖిలాఫతు విషయమున జరిగిన అన్యాయము మాన్పుటకును స్వరాజ్యము సంపాదించుటకును సత్యాగ్రహమే శరణ్యమని గ్రహింపబడి సహాయనిరాకరణ తీర్మాన మామోదింపబడెను. సమ్మెలు, హరతాళములు, నిరసనసభలు, దేశమెల్లయెడలను జరిగెను. క్రొత్తశాసనసభలకు 1920 అక్టోబరులో జరిగిన ఎన్నికలు బహిష్కరింపబడెను. జాతీయాందోళనము తీవ్రమయ్యెను. 1921 లో జరిగిన కాంగ్రెసులో సహాయనిరాకరణోద్యమ విషయమున మహాత్మునికి సర్వాధికారము లివ్వబడెను. తాను ప్రారంభింపబోవు త్రివిధబహిష్కారము (కోర్టులు, శాసనసభలు, పాఠశాలలు - బహిష్కరించుట) సహాయనిరాకరణము లను గూర్చి మహాత్ముడు రాజప్రతినిధియగు రీడింగు ప్రభునికి 1922 లో అంత్యసందేశము పంపెను. త్వరలోనే మహాత్ముడు బార్డోలీలో పన్నుల నిరాకరణము, శాసనోల్లంఘనము, నారంభింపదలచెనుగాని చౌరిచౌరాలో జనసామాన్యములోని కొందరు చేసిన దుండగములును ప్రాణిహింసయు జూచి దేశమింకను సిద్ధముగా లేదని తన యుద్యమము నాపివైచెను. ప్రభుత్వమువారు తత్క్షణమే మహాత్ముని పట్టుకొని రాజద్రోహమునకు 6 సంవత్సరముల శిక్షవేసిరి. దేశములో తీవ్రనిర్బంధవిధాన