388
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
జారీచేయబడిన అన్యాయములైన ఉత్తర్వులకును అక్రమ శిక్షలకును అవమానములకును కారకుడైనాడు.
8. జలియనువాలాబాగు వథలు జరిగిన పిమ్మట తన చర్యలవలన దానికి సహాయభూతుడైనాడు. మఱియు తాను నిర్ణయించిన పద్దతుల ప్రకారము జరుపబడిన అత్యాచారములకెల్ల బాధ్యుడైనాడు.
9. ఇతడు పంజాబు ప్రజలపైన కక్షగట్టి శిక్షార్థపు పన్నులను, జుల్మానాలను, విధింపజేసి వానిని క్రూరముగా వసూలు చేయించినాడు.
10. అమృతసరమున ఇంత అశాంతి, ఇన్ని దౌర్జన్య ములు, అత్యాచారములు జరిగినను, ఇత డచ్చటికి పోయి ఏమి జరిగినదనియైన విచారింపలేదు.
11. తా నీ దేశము వదలిపోవునప్పుడు, తన అధికారమును, ప్రాపకమును వినియోగించి, తనపట్ల ప్రజలకు భక్తి విశ్వాసములు గలవని చూపుటకు తనకు వీడ్కొలుపులు సమ్మానములు, వినతిపత్రములు నిచ్చునట్లు బలవంతము చేసినాడు. అందొక దానిలో కొన్ని సంగతులను దిద్ది ఇంగ్లాండులో తనను సమర్థించుకొనుట కుపయోగించుకొన్నాడు.
IV
సహాయ నిరాకరణము.
పైన చెప్పబడిన ఘోరమైన అన్యాయములు విచారించి దుర్మార్గులను శిక్షింపకపోవుటయేగాక డయ్యరు చేసిన అకృత్యములను పొగడి వానిని గౌరవించుట చూడగా గాంధి మహా