ఖూనీబాగ్
387
3. ఐరోపా సంగ్రామముకొరకు, సైనికులను జేర్చుటకును యుద్ధవిరాళముల నిధులను యుద్ధఋణమును సేకరించుటకును తన అధికారము నుపయోగించినాడు. తన క్రింది యధికారు లిందుకొఱకు గావించిన అన్యాయముల నెల్ల కప్పిపుచ్చినాడు.
4. తనకు లొంగనివారిని, ఏమాత్రమైన రాజకీయాభివృద్ధికావలెనని కోరినవారిని, స్వాతంత్ర్యబుద్ధి గలవారిని, అణచివేయుటకు శాసనధర్మముల నుపయోగించినాడు.
5. పంజాబులో 'మార్షల్ లా' అవసరమని కేంద్రప్రభుత్వమునకు అబద్ధములు జెప్పి మోసగించినాడు.
సామాన్య రాజద్రోహనేరములనుగూడ సైనికశాసనధర్మముక్రింద నిరంకుశముగా విచారణలు చేయించినాడు. తన యభిప్రాయములతో 'జనరల్ ఆఫీసర్ కమాండింగ్' ఏకీభవించుచున్నాడని అబద్దములాడి కేంద్రప్రభుత్వమును మోసగించినాడు.
6. పంజాబులో నెట్టి తిరుగుబాటును లేకున్నను, ఎట్టి అశాంతియు మఱల కలుగునను నమ్మకము లేకపోయినను, కేవలము కక్ష సాధించి కసితీర్చికొని శిక్షార్ధముగా శాస్తిచేయుటకు వీలుగానుండుట కొఱకు (మార్షల్ లా) సైనికశాసనముయొక్క ప్రయోగమును అనవసరముగా పొడిగింపజేసినాడు.
7. ప్రత్యక్షముగాను పరోక్షముగాను స్వయముగా ప్రోత్సహించియు, హర్షించియు, పంజాబులో నాకాలమున