Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

17


నెల్ల రూపుమాపిన పిదప నితడే మరల నాంగ్లేయప్రభుత్వ కంపెనీక్రింద నారాష్ట్రమునకు కమీషనరుగ నియమింపబడెను. తన పరిపాలనలో నితడు కొంత ఉదారభావమును జూపి ఆంగ్ల విద్యాపద్ధతులు స్థాపించి దేశీయుల కాంగ్లపరిపాలనపై భక్తి గలిగించుటకు ప్రయత్నించినాడు. ఇతడు వ్రాసిన సంగతులను బట్టియే పీష్వాలకాలమునాటి పరిపాలన ఎంతచక్కగా నుండెనో తెలియగలదు. పీష్వాప్రభుత్వ కాలమున పుసహా యొకమహానగరము. ఇంతటి గొప్పనగరమున గూడ నొక్క బందిపోటయిన జరిగియుండలేదన్నచో దేశ మెంత శాంతిసౌఖ్యముల ననుభవించుచుండెనో తెలియగలదు. మద్యపానము పూర్తిగా నిషేధింపబడెను. నేటి రివిన్యూపరిపాలనలో ప్రసిద్దిజెందిన జమాబందీ పద్దతిని మొట్టమొదట స్థాపించినవాడు నానాఫర్నవీసు అను మహారాష్ట్ర పరిపాలకుడే ! దానినే తరువాత బ్రిటిష్ పరిపాలకు లవలంబించిరి. రాజ్యపరిపాలనకు సంబంధించిన లెక్కలు, ఆదాయవ్యయపట్టికలు, జమాఖర్చు లెక్కలు మొదలగునవి తయారు చేయుపద్ధతులు గూడ నాకాలముననే ప్రారంభింపబడినవి. నానాఫర్నవీసుచే నియమింపబడిన గూఢచార్లు పోలీసుభటులు, ఏసర్దారు ఎప్పు డే మనుష్యునితో ఏమి మాట్లాడినది గూడా ఆయనకు తెలియబరచుచుండిరి. అయితే దేశభక్తుల నేదో విధముగా బంధింపదలచు నేటి సి. ఐ. డి. లకు నాటి గూఢచారుల కెంతో భేదముకలదు. నేటి ప్రభుత్వ పద్ధతులలో చాలవరకు పీష్వాలకాలమునాటివేగాని పద్దతుల యుపయోగములో మార్పులున్నవి. పీష్వాలపరిపాలనలో