Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖూనీబాగ్

383


అవసరమైనచో నందుకొరకు సాత్వికనిరోధముకూడ చేయదలచెను. ఈ సందర్భమున దేశములో నెన్నోసభలు చేయబడుచుండెను. రౌలటు శాసనముపట్ల తీవ్రమైన అసమ్మతిని దెల్పుచు 1919 ఏప్రియలు 6 వ తేదీన దేశములో శాంతియుతముగా సభలు, హర్తాళములు చేయబడెను. కొన్ని చోట్ల హర్తాళములు చేయుటకు బలవంతములు జరిగినను పోలీసువారికిని ప్రజలకును కొన్నిచోట్ల స్వల్పపు పోరాటములు జరిగినను మొత్తముమీద దేశనాయకులు శాంతిని స్థాపింపగలిగిరి. పంజాబులో అమృతసర్ లో జాతీయనాయకులగు సత్యపాలు కిచ్లూగార్లను ఏప్రిలు 10వ తేదీన అధికారులు ఆకస్మికముగా పట్టుకొని ప్రవాసమంపిరి. అంతట దీనికి ప్రజలు తమ అసమ్మతిని తెలుపసాగిరి. ఈప్రజలు శాంతియుతముగనే యున్నను పోలీసువారు వీరిని పోనీయక ఆటంకపరచిరి. ఈ గుంపు పోలీసులను వెనుకకు నెట్టిన దనునెపమున వీరిపైన పోలీసువారు తుపాకులు కాల్చగా చాలమంది గాయపడిరి; కొందఱు చచ్చిరి. అంతట నీ ప్రజలలో కొంత కల్లోలము కలిగెను. వీరిలో కొందరు దౌర్జన్యము జరిపినమాట వాస్తవమేగాని ఇంతలోనే కమిషనరు శాంతిభద్రతలను స్థాపించుటకు మిలిటరీ అధికారియగు డయ్యరును సహాయము కోరవలసిన ఆవశ్యకత యెంతమాత్రమును లేదు.

13 వ తేదీన 20 వేల మంది అమృతసరమున జలియన్‌వాలాబాగ్‌లో శాంతియుతముగా సమావేశమై 10 వ తేదీన జరిగిన కాల్పులనుగూర్చి అసమ్మతిసభను జరుపుచుండగా డయ్యరు అచ్చటికి ప్రత్యక్షమై వారిని తొలగిపోవుడని ముం