378
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
నాధీశులను అందుపాల్గొనుట కవకాశమిచ్చిరి. తరువాత జరిగిన సంధిసమయమందు కూడ భారతదేశము పాల్గొనుటయు సంధిపత్రముపైన భారతదేశపు ప్రతినిధులు సంతకము చేయుటయు జరిగినందున అప్రయత్నముగ నిట్లు భారతదేశమునకు అంతర్జాతీయ వ్యక్తిత్వమొకటి యేర్పడెను. ఈ సందర్భములలో బ్రిటిషుసామ్రాజ్యమువారు భారతదేశరాజకీయ వాతావరణమందు కొంతశాంతినికలిగించి భారతదేశమున కాసగొలిపి వారివలన సహాయముపొంది తమయాపద గడవబెట్టుకొనుట యుక్తమనితోచి భారతీయులకు క్రమక్రమముగా బాధ్యతాయుత స్వపరిపాలనమునందు అనుభవము కలిగించి వారికట్టి స్వపరిపాలనము నిచ్చుటయే తమయుద్దేశమనియు సామ్రాజ్య పరిస్థితులలో కొంత శాంతి యేర్పడగానే అందు కనుగుణములగు ఏర్పాటులు గావింపబడుననియు తమరాజ్యంగ మంత్రియగు మాంటేగ్యూ చేత 1917 ఆగష్టు 20వ తేదీన బ్రిటిష్‌వారొక ప్రకటనజేసిరి. దీనివలన భారత దేశములో గొప్ప యుత్సాహము కలిగెను. అనీబిసెంటుగారిని విడుదలచేయగా దేశములో ఆమె కెంతో గౌరవము కలిగెను. ఆమె కలకత్తా కాంగ్రెసుకు అధ్యక్షత వహించెను.
ఐరోపాసంగ్రామమున బ్రిటీషుసామ్రాజ్యముయొక్క మిత్రమండలి కే జయము కలిగినది. తరువాతజరిగిన సంధి యేర్పాటులందును బ్రిటిషుసామ్రాజ్యమువారియొక్క రాజ్యతంత్రమునకే జయముకలిగి వారికే విశేషలాభములు చేకూరెను. అంతట భారతదేశమునకు తాముచేసిన వాగ్దానములను చెల్లిం