Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

భారత దేశమున


ఆదినములలో దేశము బలమైన ప్రభుత్వముక్రింద శాంతిభద్రతలతో సుభిక్షముగనుండెను. సాధారణ వివాదలును, కులకక్షలును గ్రామపంచాయతులవలన నే పరిష్కరింపబడు చుండెను. గ్రామ ప్రజలపైన వానికి గొప్ప పలుకుబడియుండెను. గ్రామ స్వపరిపాలనా స్వాతంత్యమునకు మొగలు ప్రభుత్వమెట్టి భంగము కలిగింపలేదుసరికదా దానినింకను ప్రోత్సహించి గ్రామవ్యవహారములన్నియు పంచాయతీ కే వశముచేసియుండెను. (Administration of Justice under Muslim Rule: Wahed Hussain P.46)

భారతదేశమున నింగ్లీషుకోర్టులు వృద్ధియైనకొలదియు అబద్ధపు సాక్ష్యములు అందువలన న్యాయపరిపాలనలో కలుగు అన్యాయములు వృద్ధిజెందెనని చరిత్రకారులు చెప్పుచున్నారని జాన్‌బ్రైట్ ఉపన్యాసములందు చెప్పినాడు. (Vol. II. P. 42.)

బొంబాయిరాజధాని ఇంగ్లీషువారిచేతిలో పడునాటి కచ్చట మహారాష్ట్రపరిపాలనావిధాన మమలులో నుండెను. విజయనగర సామ్రాజ్యాధీశుల ఆంధ్రపరిపాలనా పద్ధతులనే శ్రీఛత్రపతిశివాజీయు నాయన తరువాత పరిపాలించిన పీష్వాలును అవలంబించిరి. (Tilak's speeches 31–3–18 Gokhale Hall) అష్టప్రధానుల ప్రభుత్వమని యత్యంత ప్రఖ్యాతిగాంచిన పరిపాలనా విధానము నాంధ్రసామ్రాజ్యము నుండియే గ్రహించిరి.

ఈ మహారాష్ట్ర పరిపాలనను ధ్వంసముజేసినది ఎల్ ఫిన్ స్టన్ అను నాంగ్లేయ రాజ్యతంత్రజ్ఞుడు. మహారాష్ట్రపద్ధతుల