పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

373


రనియు వారిలో 34 మందిపైన నేరమునుమోపి విచారించిరి. వారిలో 15 మంది యువకులు శిక్షింపబడిరి. ఈ ఆలీపూరు కుట్రకేసులో శిక్షింపబడినవారిలో శ్రీ అరవిందఘోషుగారి సోదరుడగు బరీంద్ర కుమార ఘోషుకూడ ఒకడు. అరవిందునిపైన గూడా నేరములు మోపిరి. ఆయన తరఫున చిత్తరంజనదాసుగారు వకీలు. అరవిందఘోషు విడుదల అయిన తరువాత ఆయన ఫ్రెంచి రాజ్యములోనికిపోయి పాండుచెరీలో తపమాచరింపసాగెను. విప్లవోద్యమముల నణచుటకు ప్రయత్నించు నెపమున ప్రభుత్వము విపరీత నిర్బంధములెల్ల ప్రయోగించి ప్రజల స్వాతంత్ర్యములెల్ల అణగద్రొక్కి వేయుచుండెను. తమ కెదురాడువారు లేకుండ ప్రజాభిప్రాయము నణగద్రొక్కి వేయదలచి ప్రభుత్వమందుకు వలసిన క్రొత్త శాసనములనుగూడ చేసెను. 1908 లో నేరముల ప్రోత్సాహ చట్టమును ప్రయోగించి ముద్రణాలయములను పత్రికలను బెదిరించెను. ప్రేలుడుపదార్దములచట్టము శాసించెను. ప్రచారముచేయు జాతీయసంస్థల నణగద్రొక్కుటకు 'క్రిమినలు లా అమెండు మెంటు' శాసనమును జేసెను. సైనికశాసనము నందువలె తీవ్ర నిర్బంధ విధానములందు ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యములను నాశనముజేసి ప్రజాభిప్రాయము నణగద్రొక్కి వైచిరి. ఈ నిర్బంధములను, క్రూరవిధానమును చూచి దేశములోని మితవాదులు ప్రభుత్వము నేమనలేక హాహాకారములు మాత్రము చేయసాగిరి. వీ రీ హాహాకారములుకూడా చేయకుండ వీరిని బుజ్జగించి వీరిని చేరదీసి తమ