370
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
కాశీనాధుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్యగార్లవంటి దేశనాయకులను, ఇంకను జాతీయకళ్యాణముకొరకు సర్వస్వము త్యజించి దేశముకొర కాహుతియై ధన్యులైన అసంఖ్యాకులగు అజ్ఞాతవీరులను, ఆంధ్రదేశమునకు ప్రసాదించి గాంధిమహాత్ముని స్వాతంత్ర్యయజ్ఞమునకు స్నాతకులుగ జేసినది. నాడు దేశములో నెల్లయెడల జాతీయవిద్యయు స్వదేశపరిశ్రమలు దేశాభిమానమును ప్రజ్వరిల్లెను.
V
దారుణవాదము ('టెర్రరిజం'.)
దేశములో ప్రభుత్వమువారు ప్రజాస్వాతంత్ర్యముల నణగద్రొక్కి వేయుచు తీవ్రనిర్బంధవిధానము నవలంబించుచున్న కొలది, ప్రజలలో నందుముఖ్యముగా యువకులందు రోషము హెచ్చుట సహజము. ఈ కారణమువలన దేశాభిమానము రహస్యమార్గములబట్టి పోవుచు వక్రగతిని నడువసాగెను. వంగరాష్ట్రమున కొందఱు యువకులు ఈ పరాయి ప్రభుత్వము నేవిధముగానైనను తిరుగదోడవలెనని నిశ్చయించుకొని అందుకొఱకు రహస్యసంఘములు స్థాపించి దేశముకొఱకు ప్రాణము లర్పించుటకు కాళికాశక్తియెదుట ప్రమాణములు జేసి కార్యదీక్షతో పనిచేసిరి. ఐరోపాలో పరాసుదేశమునను, అమెరికాలోను, జరిగిన స్వాతంత్ర్యయుద్ధములను రష్యాలోను ఇతరచోట్లను అచ్చటి నిరంకుశ ప్రభుత్వములను తిరుగదోడుట