పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

366

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


స్త్రీపురుషులెల్లరుకూడ నీదేశభక్తియందు లీనమై పోవుచుండిరి. చిన్న పిల్లలును తుదకు గోరువంకలును కూడ “వందేమాతరం మనదే రాజ్య" మని పలుకుట సర్వసామాన్యమై పోయినది.

ఈ వందేమాతరమనుమాట దొరలకు కర్ణకఠోరముగ నుండినందున వారు దౌర్జన్యములు చేయుచుంరి. 31-5-1907 తేదీన సాయంత్రం షుమారు 5గంటలవేళ కాకినాడలో మెడికల్ ఉద్యోగి కెంపుదొర పోవుచుండగా కోపల్లె కృష్ణారావు అను బాలుడు 'వందేమాతరం' అని అరవగా ఆదొర కుర్రవానిని బూటుకాళ్లతో త్రొక్కి, వాడు స్పృహ తప్పిపడిపోగా క్లబ్బుకు వెళ్ళిపోయెను. అంతట ప్రజలు రోషావేశులై రాత్రిపదిగంటలకు క్లబ్బును ముట్టడించి గలభా చేయుచుండగా పోలీసులు తుపాకులతో కాల్చెదమని బెదిరించుటయు కొందరుసోడాబుడ్లను విసరుటయు జరుగగా దౌర్జన్య నేరమునకు కొందరిపైన కేసులుపెట్టి శిక్షించిరి. ఇరువురు కాకినాడ కాలేజి విద్యార్థుల నరెస్టు చేసిరి. దీనికి శాస్తిగా ఊరిలో శిక్షార్థవు (ప్యూనిటీవు) పోలీసు నగరవాసుల ఖర్చుపైన నిలిపిరి. ఈపోలీసు సోల్జరులు వీధులవెంట తిరుగుచు ప్రజలను బెదరించుచుండిరి.

ఆనాడు మన రాష్ట్రమందు ఆంధ్రపౌరుషము తేజరిల్లి వంగరాష్ట్రముతో వియ్యమందసాగెను. నాడు విద్యార్థులలో సంచలనము కలిగి తిలకమును ధరించి వందేమాతర చిహ్నములను ధరించి పాఠశాలలకు పోయి వందేమాతరమని పలుమరు స్మరించుచుండిరి. ఆనాడు రాజమహేంద్రవర కళాశాలలో బి.ఏ. క్లాసు చదువుచుండిన గాడిచెర్ల హరిసర్వో