Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

15


సోదరుల పక్షము వహించినవారిని కూడా ఆయుధవిసర్జన చేయగానే ఇతడు క్షమించుచుండెను. (History of India - Alexander Dow) తన సింహాసనమునకు మొప్పము కలుగునట్లు చరించిన బందుగులయెడల తప్ప తక్కినవా రందరిపట్ల నితడు చాల ఉదారుడుగ నుండెను. శిక్షించుటయన్న అతని కిష్టములేదు. పుర్రెలతో విజయస్తంభములు నిర్మించుట, జనవధలుచేయుట, మొగలువంశపరిపాలన ప్రారంభదినము లందువలె కౄరకృత్యములుచేయుట యితనికిష్టము లేకుండెను. (Kennedy: History of the Great Moghals)

కేవలము మొగలు చక్రవర్తులేగాక ఆకాలమునాటి సుబేదారులుకూడా నిష్పక్షపాతముగా న్యాయవిచారణ చేయుచుండిరి. వంగరాష్ట్రన బాబు మూర్షిద్‌కూలీఖాను ధర్మపరిపాలనకొరకై తనకొమారుడుచేసిన నేరమున కతని కురిశిక్ష విధించెను. త క్రింది యుద్యోగులన్యాయము చేసినట్లు తెలిసినచో తాను పునర్విచారణచేయును. ఎంతదరిద్రుడైనను ఆయనవలన న్యాయము పొందగలుగుచుండెను. ( Stewart: History of Bengal)

విజయనగర సామ్రాజ్యమునను మొగలు సామ్రాజ్యముననుగూడ ప్రజలు శాంతిభద్రతలు గలిగి సుఖముగా నుండిరి. ఆకాలమున వ్యాజ్యములు వివాదలు హెచ్చుగా లేకపోవుటకు కారణము ఆనాటి ప్రజలకు నేటివలె కోర్టు వ్యాజ్యములయం దాసక్తి లేక పోవుటయె. న్యాయశాస్త్రము యొక్క గుంటచిక్కులు, అందలి జూదరితనమును వారెరుగరు.