Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

360

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఉత్తరువులు ప్రకటనలు తాఖీదులు బహిరంగముగా తృణీకరింపబడసాగెను. స్వదేశీయుద్యమము బయలుదేరి విదేశవస్తు, బహిష్కరణముచేయుటకు ప్రమాణములతో సాత్వికనిరోధము నారంభించు సన్నాహములుగూడ జరిగెను.

1905 లో భారతదేశపక్షమున గోఖలేగారును, లాలా లజపతిరాయిగారును ఇంగ్లాండులో గొప్ప ప్రచారము గావించిరి. గోఖలేగారు 50 రోజులలో 45 మహోపన్యాసములు గావించిరట! గోఖాలేగారు వంగరాష్ట్రవిభజన విషయమున ప్రజాపక్షమునే యవలంబించి పనిచేయసాగిరి. ఇంగ్లాండునుండి రాగానే గోఖలేగారు కాంగ్రెసు మహాసభకు అధ్యక్షత వహించి జగద్విఖ్యాతమైన ఉపన్యాసము నొకదానినిగావించిరి. కర్జనుప్రభువుయొక్క నిరంకుశ పరిపాలనమును ఔరంగజేబు పరిపాలనముతో పోల్చిచూపి బ్రిటిషు పరిపాలనలోని లోతుపాతులను గుట్టుమట్టులను వెల్లడించిరి. వంగరాష్ట్ర విభజనను తీవ్రముగ ఖండించిరి. స్వదేశీ బహిష్కారోద్యమములను సమర్ధించిరి.

స్వదేశీయుద్యమము వంగరాష్ట్రమునుండి బొంబాయి పంజాబు రాష్ట్రములలోనికి వ్యాపించి ఆందోళనము అతి తీవ్రమయ్యెను. బాలగంగాధరతిలకు, లజపత్ రాయి, బిపినచంద్రపాలు లీయుద్యమమునందు గొప్ప ప్రచారము గావించిరి. “వందేమాతరం” “బాల్ లాల్ పాల్ " అనుమాటలు నాటి రోజులలో ప్రతి స్త్రీపురుషునినోటను ప్రతిధ్వను లిచ్చు చుండెను. వందేమాతర మని యొక రనగా, మనదే రాజ్యమని