Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

359


అందులో రాజాధిరాజులచేత మ్రొక్కించుకొన్నాడు. ఈతడు గావించిన ఉపన్యాసములందు భారతీయులను గూర్చిన అవమానపు మాటలు అత్యధికముగా నుండెను. అంతేకాదు. తన చర్యలందుగూడ భారతీయప్రజాభిప్రాయమును తృణీకరించెను. ఇతని విశ్వవిద్యాలయచట్టము, మునిసిపాలిటీల చట్టము చాల అసంతృప్తిని కలిగించెను. అన్నిటికిని తోడు తూర్పు వంగరాష్ట్రభాగములను విడదీసి అస్సాములోని కొన్నిజిల్లాలతో కలిపి ఒకభాగముగను, తక్కినజిల్లా లొక భాగముగను, ఇరువురు లెఫ్టినెంటు గవర్నర్లక్రింద నుంచునట్లు కర్జను నిశ్చయించి దేశప్రజ లెల్లరు వలదని మొత్తుకొన్నను వినక 1905 సెప్టెంబరులో నా ప్రకార మొకచట్టమును జేయించెను. . దీని కే బంగాళావిభజనమని పేరువచ్చెను. ఇది 1905 అక్టోబరు 16వ తేదీన అమలులోనికి వచ్చెను. అదివరకు వంగరాష్ట్రము నందలి శాసనసభలు, ప్రజలు, ప్రభుత్వచర్య లెల్ల తీవ్రముగా ఖండించుచుండుటకు ప్రతిక్రియగా ఈ రాష్ట్రములోని హిందువులను మహమ్మదీయులను విడదీసి పాలించు కుటిలరాజ్యతంత్ర ప్రయోగమే ఈ విభజనకు కారణమని ప్రజలు తలచిరి. అంతట దీనినిగూర్చి ప్రజలలో తీవ్రమైన విషాదాందోళనములు కలిగెను. ఈ విభజనను రద్దుచేయుకొఱకు బయలుదేరిన ఆందోళనము గొప్ప జాతీయోద్యమముగా పరిణమించెను. స్వధర్మము, స్వదేశము, స్వరాజ్యము అను మాటలెల్ల “వందేమాతరం" అను పదములో మిళితమై దేశ మెల్లయెడలప్రతిధ్వను లిచ్చెను. ఈ విభజనక్రింద నిరువురు లెఫ్టినెంటు గవర్నరులు జారీచేసిన