పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


లో, హిందువులకును మహమ్మదీయులకును తగవులు ప్రారంభమయ్యెను.

దేశభాషాపత్రికల శాసనము 1882 లో రద్దుచేయబడినది మొదలు దేశభాషలందు జాతీయ పత్రికలు వృద్ధియై దేశములో తీవ్రమైన రాజకీయాభిప్రాయములను వెదజల్ల సాగెను. 1891 లో పీనలుకోడ్డు సవరణచేయబడి బాలికలతోడి సంపర్క నేరములలో అంగీకారమున కేర్పరుపబడిన వయస్సు పరిమితి హెచ్చు చేయుటకు ఒక శాసనము (Age of consent Bill) చేయబడెను. దీనిని గూర్చి పూర్వాచార పరాయణులు తీవ్రముగా ఆందోళనము చేయసాగిరి. ఈ సందర్భములో “బంగబాసీ” యను వంగపత్రిక సంపాదకుని పైన ముద్రాపకునిపైన రాజద్రోహనేరమును మోపి శిక్షించిరి.”

ఈ ఆందోళన ఫలితముగా 1892 సం|| లో భారతదేశ రాజ్యాంగవిధానములో శాసనసభలను సంస్కరించుచు పార్లమెంటు వారొక చట్టమును గావించిరి. దీనివలన గవర్నరుజనరలుయొక్క శాసనసభలోని అదనపుసభ్యులసంఖ్య 16 మందికి హెచ్చింపబడెను. ఈ సభ్యులలో కొందరిని గవర్నరుల శాసనసభలవారు ఎన్నుకొనునట్లు అప్రత్యక్షపు టెన్నిక (ఇండైరెక్టు ఎలెక్షన్) పద్దతి నిర్ణయించి నియోజకవర్గముల నేర్పాటుచేయగలందుల కొక రెగ్యులేషను శాసించుట కీ శాసనసభకే అధికార మొసగబడెను.

దాదాభాయి నౌరోజి 1892 లో పార్లమెంటు సభ్యుడై భారతదేశ వ్యవహారములను గూర్చి విచారణ చేయవలసినదని