వందేమాతరం
353
రెండవ ప్రకరణము
వందేమాతరం
I
కాంగ్రెసు మహాసభ మొదటి సమావేశము జరిగిన 1885 మొదలు ప్రతియేటను సమావేశమై రాజకీయ సాంఘిక సంస్కరణములను గూర్చిన తీర్మానములు చేయుచుండెను. ప్రభుత్వ శాసనసభలకు భారతీయ ప్రజాప్రతినిధులు ఎన్నుకొనబడవలెననియు, ప్రభుత్వవ్యవహారములందు భారతీయులు పాల్గొనుటకు అవకాశము లుండవలెననియు, ఉన్నత ప్రభుత్వోద్యోగములందు భారతీయులు హెచ్చుగా నియమింపబడ వలెననియు ఇంగ్లాండులోను ఇండియాలోను ఐ. సి. ఎస్. పరీక్షలు జరుపవలెననియు ఇంక నెన్నో తీర్మానములుగావించి ఆందోళన ప్రారంభించెను. “ఇండియా" అనుపేరుతో ఇంగ్లాండులో నొకవార్తాపత్రికనుస్థాపించి ప్రచారముచేసెను. ఆనాటి రాజప్రతినిధియగు డఫ్రిన్‌ప్రభువు స్థానికశాసనసభలయందైనను భారతదేశ ప్రజాప్రతినిధులను నియమింపవలెనని సలహానిచ్చెను. 1890లో కాంగ్రెసువా రింగ్లాండుకొక ప్రాతినిధ్యమంపిరి. కాంగ్రెసు మహాసభవారి కోరికపైననే ఛార్లెస్‌బ్రాడ్లా అను స్వాతంత్ర్య ప్రియుడు భారతదేశమునకు స్వపరిపాలనమివ్వ వలెనని ఆంగ్లపార్లమెంటులో నొక చిత్తుచట్టమును ప్రవేశపెట్టెను. ఇట్లు రాజకీయాందోళనము తీవ్రతరముకాగా, విడదీసి పాలించు పద్దతిని హిందూదేశప్రభుత్వమువారు ప్రారంభించిరి. 1890