348
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
జరుగు కోర్టువ్యాజ్యములనియు, గ్రామ ఋణములకు సంబంధించిన వ్యాజ్యములనెల్ల, గ్రామస్థుల కష్టసుఖములెఱిగిన భారతీయ న్యాయాధిపతులే శీఘ్రముగను ఖర్చులేకుండగను, ఆయాగ్రామములలోనే పరిష్కరించ వలెననియు, ఆగ్రామములోనే విచారించినచో నిజము బయల్పడి తీరుననియు అబద్ధము లాడుటకు జంకుదురనియు ఇతడు సలహానిచ్చెను. నేటి శొంఠి రామమూర్తి సత్యనాధనులగార్ల అభిప్రాయములవలెనే ఇతని యభిప్రాయములును ఉదారములై యుండెను, గాని లాభము లేకపోయెను. అతడు తయారుచేసిన ప్రణాళికను బొంబాయి గవర్నమెంటువా రమలులో పెట్టలేదు. ఇతనికి లెఫ్టినెంటు గవర్నరుపదవి నిచ్చుటకు గవర్నరుజనరలైన లిట్టను శిఫారసు చేయగా హ్యూముగారే తన కది వలదనిరి. హోం మెంబరుగా నియమింపుడనగా ఇంగ్లాండునుండి దిగుమతియగు బట్టలపైన గలపన్నును తీసివేయుటకు హ్యూముగా రిష్టపడరని శాలిన్ బరీ ప్రభువు దానికి అడ్డుపడెను.
హ్యూముగారు 1882లో పింఛను పుచ్చుకొని భారతజాతీయ చైతన్యమును కలిగించుటకు పాటుపడసాగిరి. హ్యూముగారి కీ దేశమున నింగ్లాండులోను గొప్పపలుకుబడి యుండెను. అందువలననే ఆయన భారతదేశ ప్రజల అభిప్రాయమును ప్రభుత్వమునకు తెలుపగలందుల కొకజాతీయ ప్రతినిధులు సభ స్థాపింపబడుట యవసరమని ప్రచారము చేయగా ఆంగ్లేయ భారతీయ ప్రముఖులే గాక నాటి రాజప్రతినిధి డఫ్రిన్, ప్రాతరాజ ప్రతినిధులగు లిట్టన్ డల్‌హౌసీలు, ఇతర