పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/371

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
జాతీయ చైతన్యము
347
 


తీసుకొని పోత్సహించునట్లు చేసినాడు. ఆపత్రికను తర్జుమాజేసి ఇంగ్లాండులో ఇండియా కార్యదర్శికిని విక్టోరియారాజ్ఞికిని పంపుట కేర్పాటుచేసెను. నేరములనుచేయు బాలురను సంస్కరించుటకును వృత్తికళలనేర్పి సత్ప్రవర్తనము నలవరచు రిఫెర్మేటరీ లను స్థాపించుటకును 1863 లో నే ఇతడు దొరతనమును ప్రోత్సహించెను.

రాజపుత్రస్థానములోనుండి చౌక బారు ఉప్పు వచ్చి దొరతనమువారి ఉప్పు యిజారాకు నష్టము కలిగించకుండా ఆరోజులలో సింధునదిదగ్గఱ అట్టాకునుండి బంగాళాఖాతముదగ్గఱ కటకమువరకును 2500 మైళ్ల పొడవునను “సుంకముల సరిహద్దుగీత" యను నొకముళ్లతీగె బందోబస్తును చాలా సొమ్ముఖర్చుపెట్టి దొరతనమువారు చేయుచుండిరి. ఇది చాలా అసహ్యమైన కార్యమని తలచి ఇతడు పశ్చిమోత్తర (ఆగ్రా) రాష్ట్రములో కస్టమ్సు కలెక్టరుగానుండగా దానిని తీసివేయించుటకు కృషిచేసినాడు. 1870 మొదలు 1879 వరకు ఇతడు గవర్నరుజనరలు కేంద్రప్రభుత్వమున కార్యదర్శిగా నుండెను. ఇతని స్వతంత్రబుద్ది, తెలివి తేటలు, అచ్చటి దొరలకు గిట్టకపోగా అతనిని బదలాయించిరి. ఇతడు 1879 లో నొక వ్యవసాయ సంస్కరణ ప్రణాళికను తయారు చేసెను. రాజప్రతినిధి మేయో సానుభూతి కనబరచెనుగాని తెల్లదొరలు ఇది జరుగనీయలేదు. గ్రామములందలి రైతులు షాహుకారుల చేతిలో బానిసలై పడియుండుటకు మూలకారణములు అమిత వ్యయకారణములై దూరప్రదేశముల