పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

346

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


జారీచేసిరి! పాప మీ కలెక్టరుగారు ప్రజలను తమ పిల్లలను పాఠశాలల కంపవలసినదనియు పాఠశాలలకు సాయపడవలసిన దనియు ప్రోత్సహించుచున్నందుకు ప్రభుత్వమువా రితనిని మందలించిరి ! దీనినిగూర్చి యితడు తీవ్రమైన అసమ్మతిని తెలుపుచు, పై అధికారులకు వ్రాసినాడు. న్యాయవిచారణాధికారులకే పోలీసు అధికారము లుండుటవలని యన్యాయములను, పోలీసుచేయు జులుమును గమనించి దానిని విడదీయవలెనని ఇతడు శిఫారసుచేసెను గాని లాభము లేకపోయెను. గవర్నమెంటువారి ఆబ్కారీ విధానమువలన ప్రజలు నాశనమై పోవుచున్నారనియు దానివలన వచ్చుసొమ్ము పాపఫుద్రవ్యమనియు నిది శ్రేయస్కరము కాదనియు గవర్నమెంటుకు వచ్చు ఒక్కొక్క రూపాయి పన్నుకు ఈ వ్యసనమున తగుల్కొనినవారు నేరములు చేయుచున్నందున దానిని అణచుటకు ప్రభుత్వమువారు చేయుచున్న ఖర్చు రెండేసి రూపాయలు అగుచున్నదనియు, దీనిని సంస్కరించు మార్గము కనబడుట లేదనియు నితడు వగచి తాను బ్రతికియున్నచో నీ యన్యాయమును రూపుమాప ప్రయత్నింతు ననినాడు. నాడు కోర్టులలోని యత్యధిక వ్యయము, రివిన్యూవిధానములోని నిరంకుశత్వము, ఆయుధచట్టము ఫారెస్టు చట్టము నిరంకుశముగా అమలు జరుగుట, ఇంకను ప్రజలుపడు చుండిన బాధలనుగూర్చి యితడు పై యధికారులకు వ్రాసినాడు. 1859 లోనే ఇతడు "పీపుల్సు ఫ్రెండ్" అను నొక దేశభాషపత్రికను స్థాపించుటకు తోడ్పడి సంయుక్తరాష్ట్ర ప్రభుత్వమువారు 600 ప్రతులు