జాతీయ చైతన్యము
345
తానుగూడ ఈసమాజమున జేరిరి. తిలకుగా రిట్లు తన విద్యార్థి దశ నాటినుండియు దేశాభిమానియై దేశసేవ చేయుచు 1885 లో దాదాభాయి నౌరోజీ ఏ. ఓ.. హ్యూముదొరగారు మున్నగువారు జాతీయ కాంగ్రెస్ మహాసభ స్థాపింపగా నొకటి రెండేండ్లలోనే తిలకుగా రందు సభ్యులై జాతీయ మహాసభయొక్క దక్షిణహిందూస్థాన సంఘమునకు కార్యదర్శులై
బొంబాయి రాష్ట్రీయసభ నైదేండ్లు జయప్రదముగా జరిపిరి. ఈయన తన పత్రికలద్వారా భారతజాతీయ విజ్ఞాన వికాసములనుగూర్చి ప్రబోధము జేయసాగిరి.
III
భారతజాతీయ కాంగ్రెసు మహాసభకు మూలపురుషుడు ప్రోత్సాహకుడు "ఆలె౯ ఆక్టేవియ౯హ్యూము” అనునొక ఆంగ్లేయుడు. ఇతడు ఐ. సి. యస్. ఉద్యోగి. ఇతడు జిల్లా యధికారిగా నుండగానే ప్రజలకు విద్యాభివృద్ధి గావింప వలెననియు పోలీసుశాఖను సంస్కరింపవలెననియు సారా విక్రయమును నిషేధింపవలయుననియు దేశ భాషాపత్రికలను పోత్సహింప వలయుననియు సంస్కరణ కారాగారముల నెలకొల్పవలయుననియు ఇతర ప్రజాసౌకర్యములను గావింప వలెననియు నెంతో పట్టుదలతో కృషిచేయుచుండెను. 1857 విప్లవములో నీతడు యుద్ధమున పాల్గొని శాంతి స్థాపింపబడిన పిదప ఈ సత్కార్యములనెల్ల నాచరణలో పెట్టుటకు ప్రయత్నింపగా నాటి దొరతనమువా రడ్డుపడిరి. నేటివులను విద్యాభివృద్ధి పనులలో నియోగించకూడదని దొరతనమువారు తాఖీదు