జాతీయ చైతన్యము
343
సంఘముల నాయకులు కూడ నొక్కచోట సమావేశమయి ఒక జాతీయ దర్బారు జరిపినచో నీదేశక్షేమలాభముల కెంత తోడ్పడవచ్చును! అని సురేంద్రబెనర్జీగారు తమగంభీరకంఠస్వరముతో మహాసభలో పలుకగా నచ్చటివారెల్లరు నిది బాగున్నదనిరి. మన జాతీయకాంగ్రెస్ మహాసభను స్థాపించుటకు తోడ్పడిన ఊహలలో, సంకల్పములలో, నిదియొకటిగ నుండెను. ఇట్టి యభిప్రాయము ఆ నాడు వివిధరాజకీయ నాయకులందు కలిగెను. (అంబికాముజుందారుగారి జాతీయచరిత్ర )
బొంబాయిలో 1851 వ సంవత్సరమున స్థాపింపబడిన ప్రజాసంఘము 10 సం||రములు మాత్రేమే చక్కగా పనిజేయ గలిగెను. తరువాత నది కొన్నాళ్ళు స్తంభితమై పోయెను. గాని 1870 లో మరల నది పునరుద్దరింపబడగా 1873 లో దాని నిర్వహణమునకు నౌరోజీ ఫర్డూంజీగారు పూనుకొని దానిని అతి చతురతతో నడిపిరి. ఇంతలో ఈస్టుఇండియా అసోసియేషను దీనితో పోటీగా పనిచేయసాగెను. ఈ రెంటికిని గల స్పర్దలవలన కొన్ని చిక్కులు కలిగెను. తరువాత 1875 ఆ ప్రాంతములలో పూనాలో సార్వజనికసభ స్థాపింపబడి రావుబహద్దరు క్రిష్ణాజి లక్ష్మణనుల్‌కర్ , సీతారాం హరి, విష్ణుకృష్ణచిప్లంకర్, గార్లును ఇంక నితరులును ఆ రాష్ట్రములో నీ సంఘముద్వారా ప్రజాసేవ చేయసాగిరి.
1880 నాటికి లోకమాన్య తిలకుమహారాజు భారత దేశోద్ధరణకొరకు నడుముగట్టెను. ఈయన 1856 జూలై 23 వ తేదీన జన్మించి 1876లో బి.ఏ. పరీక్షలో నుత్తీర్ణుడై 1879లో