పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతీయ చైతన్యము

341


ప్రాయమునకు తోడ్పడుచుండెను. అంతవరకు జరిగిన సభలవలన పత్రికలయొక్క విమర్శలవలన భారతదేశమునందు కొంత జాతీయ చైతన్యము కలుగసాగెను.

దేశములో వివిధ ప్రాంతములందు రాజకీయార్థిక ప్రజాభిప్రాయము కలిగించుటకు సభలు స్థాపింపబడసాగెను. వంగరాష్ట్రమున ఇంపీరియల్ అసోసియేషన్ 1876 లో స్థాపింపబడెను. దీనికి మూలకారకుడు సురేంద్రనాథ బెనర్జీ యని చెప్పవచ్చును. ఇతడు మొదటి భారతీయ ఐ. సి. యస్ . ఉద్యోగి. ఇతనిని ప్రభుత్వములోని తెల్లవారు అనేక విధములుగా బాధించి తుదకు 1874 లో ఉద్యోగము వదలుకొనునట్లు చేసిరి. భారతీయులు ఐ. సి. యస్. చదువుటకు ఇంగ్లాండు పోవలసి యుండెను. ఇది మన ఆచార వ్యవహారములందు పొసగదు. అట్లు పోవదలచిన వారికిగూడ ఆటంకము కలుగచేయుటకు ఆపరీక్షకు పోవలసిన వయస్సు 19 కి తగ్గించిరి. అంతచిన్నవా రెట్లుపోగలరు? ఇది అన్యాయమని ప్రజాభిప్రాయమును కలిగించుటకు సురేంద్రనాథ బెనర్జీ దేశమెల్లయెడల పర్యటనము గావించి గంభీరోపన్యాసము లొసగుచు రాజకీయ ప్రచారము గావించెను. 1876లో నితడు ఇంపీరియల్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించెను. దీనికి మొదటికార్యదర్శి, ఆనందమోహనబోసు. బెనర్జీ 1876 లో సంయుక్త రాష్ట్రములు, పంజాబు తిరిగెను. 1877 లో జరిగిన ఢిల్లీ దర్బారులో నలుముఖములనుండి ప్రతినిధులు వచ్చుట చూడగా ఇట్టి జాతీయ సభయుండిన ఎంతబాగుండునని ఇతని కప్పుడే తోచిన