Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

335


టించినాడు. మా రాజప్రతినిధి జేసిన ప్రకటనలను మేము ఆమోదించుచున్నాము. అదిగాక యిప్పు డీ క్రిందిసూచనను జేయుచున్నాము. బ్రిటిషుప్రజలను హత్యచేసిన నేరములు చేసినట్లు స్థిరపడినవారిని తప్ప తక్కిన నేరములు చేసినవారి నెల్లరను మేము క్షమింప దలచినాము. హత్యగాండ్రను మాత్రము క్షమించుటకు వీలులేదు.

హత్యగాండ్రని యెఱిగియు, వారికాశ్రయమిచ్చినవారిని, విప్లవమునకు నాయకులుగా గాని పోత్సాహకులుగా గాని యుండినవారిని, వారియొక్క ప్రాణములను మాత్రము రక్షించెదము. వారికి శిక్షలువిధించుటలో వీరు రాజద్రోహము చేయుటకుగల కారణసందర్భములన్నియు ఆలోచింపబడును. కేవలము అబద్దపు ప్రచారమువలన మోసపోయిన వారిపట్ల చాలదయ దాక్షిణ్యముచూపబడును. ఇంకను మాప్రభుత్వముకు వ్యతిరేకముగా పోరాడుచున్నవా రెల్లరు వెంటనే తమ యిండ్లకువచ్చి సన్మార్గజీవనమునకు మరలినచో మేము క్షమింతుమని యిందు మూలముగా ప్రకటించుచున్నాము. రాబోవు జనవరి మొదటి తేదీలోపుగా నీ షరతులు మన్నించినవా రెల్లరు కమింపబడుదురు. పరమేశ్వరుకృపవలన శాంతికలుగగానే భారతదేశముయొక్క పరిశ్రమల కెల్ల ప్రోద్బలము చేయుటకును ప్రజోపయుక్తములును, ప్రజాభివృద్ధికరములు నగు కార్యములను చేయుటకును ఆ రాజ్యము లందందు మా ప్రజలయొక్క క్షేమలాభములకొఱ కా దేశమును పరిపాలించి ప్రభుత్వము నడుపుటకును మేము నిశ్చయించినాము. వారి అభివృద్ధిలోనే మాకు బలము,