పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

334

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


భారతీయులకుగల ప్రేమను మేము ఎరుగుదుము. ఈభావమును మేము మన్నింతుము. ప్రభుత్వమువారి న్యాయమైనహక్కులకు లోబడి అందుకు సంబంధించిన ప్రజల హక్కులనెల్ల సంరక్షింతుము. శాసనధర్మవిధులను చేయునప్పుడును వాని నమలుజరుపునప్పుడును భారతీయుల కనాదిసిద్ధముగానుండు హక్కులు ఆచారములు సామాన్యముగ గమనింప వలయుననియే మా తలంపు.

కేవలము స్వార్ధము నాశించినవారు కొందరు తమతోడి ప్రజలకు అబద్దపుమాటలు చెప్పి మోసగించి బహిరంగముగా తిరుగుబాటును పోత్సహించినందువలన కలిగినకీడులకు దురవస్థలకు మేము విచారించుచున్నాము. ఆ పితూరీని యుద్దభూమిలో అణచివేయుటవలన మాశక్తి ప్రదర్శింపబడినది. మోసపోయినవారు మరల సన్మార్గమునకు వత్తురేని వారి నేరములను మన్నించి మాకరుణకు పాత్రులుగజేయుడు.

ఇకముందు రక్తపాతము జరుగకుండగను మా భారతదేశరాజ్యములందు శాంతిని స్థాపించుటకును, మా రాజప్రతినిధి అప్పుడే కొన్నిషరతులకులోబడి యొక రాష్ట్రములో సర్వజన క్షమాపణను ప్రకటించియున్నాడు. ఇదివరకు జరిగిన దురదృష్టకరమైన కలతలలో మా ప్రభుత్వముపట్ల నేరములు జేసినవారి విషయములో కొన్ని షరతులకు లోబడి క్షమాపణ ప్రకటించినాడు. మన్నించుట కెంతమాత్రము వీలులేని నేరములు జేసినవారి విషయములో విధింపబడు శిక్షలను ప్రక