332
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
మా సన్నిహితుడగు చార్లెస్‌జాన్ వైకౌంటు క్యానింగు యొక్క రాజభక్తియందును సామర్థ్యమందును తెలివితేటలందును మాకుగల నమ్మకమునుబట్టి అతనిని మాయొక్క ప్రథమ రాజప్రతినిధిగా నియమించి మా తరఫున నారాజ్యములను పరిపాలించుటకు నియోగించినాము. మా ప్రధాన రాజ్యాంగ కార్యదర్శులగు క్యాబినెట్టు మంత్రులలో నొకరిద్వారా అతని కప్పుడప్పుడు వచ్చు ఉత్తర్వులకు లోబడి అతడు పరిపాలించును.
తూర్పు ఇండియా వర్తకసంఘమువారి కొలువులో సివిలు మిలిటరీ శాఖల యుద్యోగములందు నియమింపబడి యిప్పుడు పనిచేయుచున్నవారినెల్లరను మాచిత్తమునకును, యికముందు చేయబడు శాసనములకును రిగ్యులేషనుల కును లోబడి వివిధశాఖల యుద్యోగములందు యిందు మూలముగా ఖాయపరచుచున్నాము. భారతదేశ స్వదేశ సంస్థానాధీశులతో తూర్పు ఇండియా కంపెనీవారి హయాములో నిదివరకు చేయబడిన ఒడంబడికలను, సంధులను మేము అంగీకరించుచున్నామనియు వాని ప్రకారము జరుపవలయుననియు నిందుమూలముగా ప్రకటించుచున్నాము.
ప్రస్తుత రాజ్యభాగముల నికముందు పెంచి విస్తరింపజేయు ఉద్దేశము మాకులేదు. మా రాజ్యములపైన మా హక్కులపైన ఇతరులెట్టి యాక్రమణలు చేయుటను మేము సహింపము. ఇతరులపై నట్లు జరిగించుటకు నంగీకరింపము. స్వదేశసంస్థానాధీశులహక్కులు, దర్జాలు గౌరవమును మావాని వలెనే మేము మన్నింతుము. వారును మాప్రజలును గూడా ఆంత