పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

331


చట్టముప్రకారము భారతదేశ ప్రభుత్వమునకు శాసననిర్మాణాధికారమునిచ్చి చట్టనిర్మాణసభలలో కొందరు భారతీయులనుగూడా నియమింపదలచిరి. ప్రజాప్రాతినిధ్య పరిపాలన మేర్పడకపోయినను ఆనాటి కిది కొంత బాగుగనే యుండెను.

IV

విక్టోరియా రాజ్ఞి ప్రకటన

(1858 నవంబరు 1 వ తేదీ)

"గ్రేట్ బ్రిటన్ (ఇంగ్లాండు స్కాటులాండు వేల్సు) రాజ్యములకును, ఇంగ్లాండుకు ఐరోపాలోను, ఆశియాలోను, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియాలలోను గల వలస రాజ్యములకును సామంత రాజ్యములకును దైవకృపవలన రాణియు మతసంరక్షకురాలు నగు విక్టోరియా అను పేరుగల మేము ఇదివరకు మా తరఫున ధర్మవిశ్వాసులుగా తూర్పుఇండియా కంపెనీ పాలించు భారతదేశములోని రాజ్యభాగములను, పార్లమెంటులో సమావేశమైన ప్రభువులు కామన్సువారి సలహాతోను, అంగీకారముతోను ఇకముందు మే మే స్వయముగా పరిపాలించుటకు నిశ్చయించి యీ ప్రకటన చేయుచున్నాము.

కాబట్టి ఆరాజ్యభాగములందుగల ఆయా ప్రజలెల్లరును మాయెడల విశ్వాసము కలిగి మాయెడలను మావారసులపట్లను మాతదనంతరకర్తలపట్లను విధేయతకలిగి యుండవలసినదనియు, మా తరఫున నా రాజ్యములను పరిపాలించుటకు మేము ప్రభుత్వము చేయుటకు నియమించువారి అధికారమునకు లోబడి యుండవలసిన దనియు కోరుచున్నాము.