330
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
దేశములో శాంతికలుగగానే ప్రజాసౌకర్యములు చేయుదుము" అని గూడ విక్టోరియారాణి ద్వారా ప్రకటన గావించిరి. -
భారతదేశములో తన పరిపాలన స్థాపింపబడినదని 1858వ సంవత్సరము 1వ నవంబరు తారీఖున ఇంగ్లాండుదేశపు రాణియగు విక్టోరియా ప్రకటన గావించుచు “మా పరిపాలన క్రిందనున్న యితర రాజ్యభాగములందలి ప్రజల విషయము నందువలెనే భారతదేశపుప్రజలు విషయమునగూడ మేము ప్రభుత్వపు బాధ్యతలను వహించి ఆ బాధ్యతలనెల్ల పరమేశ్వరానుగ్రహమువల్ల సక్రమముగ కొనసాగింప నిశ్చయించితిమి." అని దానిలో నొక వాగ్దానము గావించెను. మరియు నామె యీ మార్పునుగూర్చి డర్బీప్రభువుకు వ్రాయుచు “భారతదేశ ప్రజలు బ్రిటిషు సామ్రాజ్యములోని తక్కిన భాగములందలి ప్రజలతో సరిసమానులుగ చేయబడుటవలన వారికి లభించు విశేషహక్కులును, నాగరకత యభివృద్ధి చెందుటవలన వారికికల్గు విశేషలాభములును వారికి తెలియ చెప్పుటయే" తన ప్రకటనయొక్క ముఖ్యోద్దేశమనియు నామె వెల్లడించెను.
సిపాయివిప్లవము యొక్క రాజకీయఫలితము లింకొకచోట చర్చింపబడినవి. 1858 లో భారతదేశపు పరిపాలనయందొక క్రొత్తఘట్టము ప్రారంభమైనట్లుగా యెంచవచ్చును. ఏది యెట్లున్నను భారతదేశమునకు అభయమొసగబడుచు నొక రాజ్యాంగపత్రము వచ్చినది. ఇదియే రాజ్యాంగసంస్కరణలకు దారిచూపినది.
సిపాయిలవిప్లవము తరువాత చేయబడిన క్రొత్తరాజ్యాంగ