326
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
సైన్యములు ఎవరికివారు విప్లవయుద్ధము చేయసాగిరి. అందువలన యీ విప్లవము యేహోన్ముఖమునకు రాకపోయెను. మీరతు, లక్నో, కాన్పూరు, ఢిల్లీబలము లేప్రక్కవి యాప్రక్కనే పోరాడసాగెను. వేసవి మొదలు నాలుగునెలలు పోరు తీవ్రమయ్యెను. ఆంగ్లేయులు నిరాసచెందిరి. ఇట్టి స్థితిలో వీరి యదృష్టవశమున విప్లవనాయకులందు సైన్యములందు ఐకమత్యముతగ్గెను. సిక్కు లింగ్లీషువారికితోడైరి. బ్రిటీషువారు సిక్కులస్వాతంత్ర్యము హరించి పదేండ్లయిన గాలేదు. వీరేల నాంగ్లేయుల కిట్లుతోడ్పడిరి? దీనికి గారణము లేకపోలేదు. మొగలుసామ్రాజ్యపు తుదిదినములలో విషయలోలురగు చక్రవర్తులీసిక్కుల గురువులను నిష్కారణముగావధింపగా నీసిక్కులు ఎన్నటికైన ఢిల్లీ ప్రవేశించి కొల్లగొందుమని ఆనాడే ఘోరప్రమాణములు చేసియుండిరి. ఆయవకాశము నేడు లభింపగా వీరు దేశస్వాతంత్ర్యము మాటతలపెట్టుదురా? అంతట నీసిక్కు లాంగ్లేయుల పక్షమును వహించి అత్యద్భుతముగా పోరాడి వారి యాపద గడవ బెట్టిరి. ఇదియే విప్లవము విఫలమగుటకు ముఖ్య కారణము. ఈ మహాస్వతంత్రయుద్ధమున నానాసాహెబు, ఝాన్సీ, లక్ష్మీబాయియు ఇతర మహావీరులు నతి ధైర్యముగా పోరాడిరి. లక్ష్మీబాయి రణరంగముననే ప్రాణముల బాసెను. విప్లవసైన్యములు చెల్లాచెదరయ్యెను.
కూకటి వ్రేళ్ళతో పెల్లగించి వేయబడుటకు సిద్ధమైన విజాతీయ పరిపాలన, చావు తప్పి కన్ను లొట్టవోయినట్లు ఈవల బడినది. బ్రతికి బయటపడిన ఆంగ్లేయులకు ధైర్యము