Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

323


రైతులు దరిద్రులగుట. (11) ఇటీవలి రాజ్యాక్రమణమువలన సంస్థానాధీశులు ప్రజలు కలవరము జెందుట. (12) హిందువుల వారసత్వధర్మమును మార్పుజేసి క్రైస్తవులైనను ఆస్తి హక్కులు పోవనుట. (13) సతారా, నాగపూరు, కర్ణాటక, ఝూన్సీ, తంజావూరు, అయోధ్య రాజ్యములను రూపుమాపుట. (14) వంగరాష్ట్ర సైన్యమునకు క్రమశిక్ష లేకుండుట; ఉద్యోగులు సివిలుపనులకు నియమింపబడుట; ఐరోపా సైనికులు తక్కువగానుండుట. (భారతదేశమున ఆనాటికి 40 వేలమంది మాత్రమే యుండిరి.) (15) పందిక్రొవ్వు, ఆవుక్రొవ్వు తోటాల నుపయోగించుటకు హిందూమహమ్మదీయ సిపాయిలకు స్వధర్మ విరుద్ధమై అసహ్యమగుట (16) 1856 జులైలో సైనికులు సముద్రప్రయాణము చేయవలెనను శాసనము. (17) విదేశీయుల కుట్రలు: పర్షియా రష్యాదేశములు ఆంగ్లేయ ప్రభుత్వమును తిరుగదోడ దలచుట. (18) మహమ్మదీయుల అసంతృప్తి ; అయోధ్యనవాబు బీగముల కుట్రలు.

కంపెనీవారి లోపములకన్నను, వారి తాబేదారుల దుష్పరిపాలనముకన్నను, పార్లమెంటువారి ఉపేక్షాభావము అత్యంత గర్హ్యమైనదని చెప్పక తప్పదు. మద్రాసులో “టార్చర్ కమిషన్" వారు అచ్చట జరుగుచున్న ఘోరవిషయముల నెన్నో బయల్పరచినను పార్లమెంటువారు కన్ను తెరువలేదు. ఇండియా సంగతులు పార్లమెంటులో చర్చకు వచ్చి నప్పుడెల్ల సభ్యులు విందారగింపు సమయముగా నుపయోగించు కొనుటకు బయటకు పోవుచుందురు ! మీరతులోను, కాన్పూరు