Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

317


లనుభవించుచున్నవారు లోలోపల క్రుళ్ళుచు కుట్రలుచేయుచుండిరి. ఆంగ్లేయులు మొగలాయి సామ్రాజ్యమును నాశనముచేసి ఆ దిబ్బలపైన 'విలాతీ' రాజ్యము స్థాపించినారని దేశములోని మహమ్మదీయులు అందుముఖ్యముగా అయోధ్య ప్రజలు అసంతృప్తి కలిగియుండిరి. ఇట్లు దేశములో నీ విజాతీయ కంపెనీ ప్రభుత్వముపైన అసహ్యభావము ద్వేషభావము నానాటికి వర్థిల్లుచుండెను. ఈ ప్రజలెల్లరు ఇంగ్లాండు డైరెక్టర్ల కనేకమార్లు అర్జీలుపెట్టుకొనియుండిరిగాని లాభము లేకపోయెను. భారతదేశ స్థితిగతులనుగూర్చి నాటి సంస్కర్తలు ఇంగ్లాండువారికి నివేదించి దేశప్రజలలో విద్యను అభివృద్ధి చేయుమని సౌకర్యములు కలిగించమని కోరినను లాభము లేకషోయినది. పార్ల మెంటుకుగూడా మహజరు లంపినను లాభములేకపోయినది. లక్ష్మీనర్సు మొదలగువారివంటి దేశభక్తులు వివిధరాష్ట్రములందు పత్రికలయందు విమర్శించియు, సభలందు తీర్మానములు గావించియు అర్జీలు మహజరు లంపియు, శాంతియుత పద్ధతులతో నెంత యాందోళనము చేసినను ఈ దుష్టపరిపాలనము సంస్కరింపబడలేదు. ఈ అన్యాయపు పద్ధతులు పోలేదు. పైగా ప్రభుత్వమువారు నిరంకుశులై ఈ యాందోళనము చేయుచున్న వారందరిని రాజద్రోహులుగా నెంచి వారిని పోలీసులచే వెంటాడింపజేసిరి.

ఆనాటికి భారతదేశ ప్రజలందు వివిధజాతి మతకులముల వారియందు మతభ్రష్టు లగుదుమను భీతియు విజాతీయులపైన ద్వేషమును స్వతంత్రులము కావలెనను కాంక్షయు