Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

316

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


కొరకు జరుపబడిన సహాయనిరాకరణ శాసనోల్లంఘన సత్యాగ్రహోద్యమములందు పుష్పించి కాంగ్రెస్‌వలన సంరక్షింపబడి త్వరలో ఫలింపనున్నది. ఈ స్వాతంత్ర్యఫలమును భారతీయులెల్లరు - అన్నిజాతులవారు అన్నిమతములవారు అన్నితరగతులవారు - ముఖ్యముగా తరతరములనుండి దారిద్ర్యమున, అజ్ఞానమునబడియున్న కర్షకులు కార్మికులు దీనజనులు సమానముగా ననుభవింపగలరు. ఇట్టి ఫలానుభవమునకు దోహదముచేసిన అసంఖ్యాకులగు అజ్ఞాతవీరులగు దేశభక్తులకెల్లరకు నమస్కరించి శాశ్వతముగా కృతజ్ఞులమయియుండి తరింతుము గాక!

పండ్రెండవ ప్రకరణము

భారతదేశ స్వాతంత్ర్యవిప్లవము.

I

1856 నాటికి భారతదేశ భూభాగములో రెండువంతులు బ్రిటిషుఇండియాగా మారిపోయినది. మహారాజులు , సుబేదారులు, నవాబులు చాలమంది నాశనము చేయబడిరి. కొంతమంది భయపడి కంపెనీవారికి కప్పముగట్టుచు సంస్థానాధీశులుగ మిగిలిరి. వీరిలోకూడ చాలమంది నేదో నెపమున పదభ్రష్టులుగా జేసి రాజ్యములు లాగికొనుచుండుటచే భారతదేశ సంస్థానాధీశులందు రాజులందు, నవాబులందు తీవ్రమైన అసంతృప్తి కలుగుటయేగాక తమ రాజ్యముల నెప్పుడు లాగికొందురో యను భీతియు ప్రబలుచుండెను. పదవులుపోయి పింఛను