10
భారత దేశమున
సొమ్ములో చాలసొమ్ము తగ్గెను. ఇటాలియను బాటసారి పీట్రోడెల్ వల్లె 1623లో నిట్లు వ్రాసినాడు. “సాధారణముగా ప్రజలందరు మర్యాదగా జీవించుచున్నారు. దేశములో మంచి సంరక్షణ కలదు. రాజు అనవసరమగు నేరారోపణములుచేసి ప్రజాపీడన చేయడు. ఎవరైన సుఖముగా సంపద ననుభవించుటను జూచి వారిని పీడింపడు.” (Reform Pamphlet)
అక్బరు మనుమడగు షాజహాను పరిపాలన మొగలాయి సామ్రాజ్యచరిత్రయం దుత్కృష్టమైనది. దేశము సుభిక్షముముగానుండి శాంతిని సత్పరిపాలనము ననుభవించెను. 1615లో సర్‌తామన్‌రో మొగలుదర్బారుకు ఆంగ్లరాయబారిగావచ్చి అచ్చటి మహావైభవముల జూచి ముగ్ధుడై పోయినాడు. నాటి చక్రవర్తి జహంగీరు శిబిరమున రెండు ఎకరముల ప్రదేశము, పట్టుజరీ తివాచీలతో పరుపబడియుండెను. విలువగల చాందినీలు కట్టబడియుండెను. నవరత్న ఖచితమై ప్రపంచమున కనివిని యెరుగని నెమలిసింహాసనమును నిర్మింపజేసిన షాజుహాను సింహాసనమున నధిష్ఠించిన నాటి అఖండవిభవమును జూచిన టెవర్నియరు షాజహాను తన పట్టాభిషేకమప్పుడు నవరత్నములు బంగారునాణెములతో తులాభారము తూగి వానిని జనమధ్యమున వెదజల్లెనని చెప్పుటయేగాక ఈ చక్రవర్తి కేవలము సామాన్యుడగు రాజువలెగాక తన కుటుంబమును ప్రేమతో దిద్దుకొను తండ్రివలెనే పరిపాలించెనని వర్ణించినాడు. కందహారు దండయాత్రకు తక్కిన యుద్ధములకు గావలసిన సొమ్ములెల్ల ఖర్చుచేయగా షాజహాను చనిపోవు