దేశోద్ధరణ ప్రయత్నములు
315
మన చరిత్రగ్రంథముల కెక్కుటలేదు. ఇది మన దురదృష్టము.
రాజకీయార్థికములందువలెనే విజ్ఞాన విషయములందు గూడ మనము పారతంత్ర్యమున బడియున్నాము. అందువలన మనచరిత్ర నిర్మాణవిషయమున గూడ ఏవిన్సెంటుస్మిత్తు పైననో ఆధారపడి శివాజీ కొండఎలుకయనియు, ఝాన్సీ లక్ష్మీబాయి మున్నగు స్వాతంత్ర్యయోధులు రాజద్రోహులనియు, ఎన్నో దుర్మార్గములుచేసిన క్లైవు, వార౯ హేస్టింగ్సు మొదలగు తెల్లవారు మహానుభావులనియు వ్రాయబడిన చిలుకపలుకులను మనవారుకూడ తమపుస్తకములలోని క్కెకించుచున్నారు. అంతేగాని స్వధర్మముకొరకు స్వదేశముకొరకు స్వరాజ్యముకొరకు పాటుబడి సర్వస్వమునర్పించిన మహానుభావుల చరిత్రలుకాదుగదా తుదకు వారి నామములనైనను పేర్కొనుట దేశచరిత్ర కత్యంతావశ్యకమను జ్ఞానము మనవారికి లేనేలేదు. రాజకీయార్థిక దాస్యములతోపాటు వైజ్ఞానిక బానిసత్వము కూడ మనకు దాపరించినది.
రాజా రామమోహనరాయ లాదిగాగల సంస్కర్తలు దేశారాధకుల, కృషిచేసిన భారతభూమిలో నాడు మదరాసు రాజధానిలో లక్ష్మీనర్సుగారును ఇతరరాష్ట్రములందు ఆయన వలెనే దేశోద్ధరణకొరకు పాటుపడిన మహానాయకులును స్వధర్మరక్షణకొరకు నాటిన దేశభక్తివిత్తనములు లోకమాన్య తిలకు అనీబీసెంటుల కాలమున స్వరాజ్యోద్యమమున చిగిర్చి మొలకలెత్తి కాంగ్రెస్ మహోద్యమమున మహావృక్షమై గాంధిమహాత్ముని యధ్వర్యమున పూర్ణస్వాతంత్ర్య స్థాపన