పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

313

లక్ష్మీనర్సుగారిజన్మ సార్ధకమైనది. ఆయన ధన్యుడు, - రాజకీయ పరిజ్ఞానము వృద్ధియై ప్రజాభిప్రాయము వర్ధిల్లి పత్రికల విమర్శనలు, ప్రజల ఉద్యమములు, తీవ్రతరములై సత్యాగ్రహ శాసనోల్లంఘన పద్ధతులతో ప్రభుత్వముతో పోరాడుటకు ప్రజలకు శక్తి యుదయించి ప్రజల హక్కులను కంటికి రెప్పవలె కాపాడుచు శాంతిసమరమును నడుపగల బలమైన ప్రజాసంస్థయగు కాంగ్రెసును, ఈప్రజాశక్తినెల్ల విజృంభింపజేసి ఈ శాంతిసమరమును జయప్రదముగ నడిపి ఈ దేశమునేగాక ప్రపంచమును గూడ ఉద్దరింపగల మహానాయకుడగు గాంధీమహాత్ముడు సారధియైయున్న ఈ కాలముననే ఇంకను ప్రభుత్వమన్న భయము, విమర్శయన్న జంకు, రాజకీయాందోళనమన్న వెఱపును, కలిగిన మితవాదులు పిరికిపందలు స్వార్ధపరులును మిగిలియుండగా ఇట్టి పరిస్థితులుగాని ఇట్టి ప్రజాశక్తిగాని ఇట్టి ప్రజాసంస్థగాని ఇట్టి మహానాయకుడు గాని లేనినాడు, దేశములోప్రజాభిప్రాయమే లేక స్తంభీభూతమైయుండిననాడు, ప్రజలు నోరులేనివారై అసహాయులై పడియుండిననాడు, ప్రభుత్వము బలవంతమై నిరంకుశమై రాక్షసత్వము ప్రదర్శించి భీభత్సము చేయుచుండిననాడు, ఒంటరియై ఇడుమలబడుటకు, ఆ ప్రభుత్వముతో ప్రతికక్షకట్టి భారతదేశప్రజల హక్కులను నాగరకతను నణగద్రొక్కి శాశ్వత రాజకీయార్థిక బానిసత్వమును స్థాపించదలచిన శక్తులతో పోరాడి అందువలన తనకు కలుగు నష్టములకు అపాయములకు సర్వనాశనమునకుగూడ సంసిద్ధుడై, ఆ నోరులేని ప్రజలకొరకు పోరాడి తనసర్వస్వమును