పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

310

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఉత్తర హిందూస్థానమున జరిగిన సిపాయిల విప్లవము అనబడు స్వాతంత్ర్య సమరముగూడ స్వధర్మ స్వదేశ స్వరాజ్య స్థాపనలకొరకే జరుగుచుండినదని గ్రహించియుకూడ లక్ష్మీనర్సు అట్టి దారుణపద్దతి నవలంబించుట కెంతమాత్రము ఇష్టపడలేదు. ఈతని సత్యశీలమును శాంతగుణమును త్యాగ ధైర్యములను ఔదార్యమునుచూచి భారతదేశములోని ఆంగ్లేయులేగాక పార్లమెంటులోని ఆంగ్లేయులుకూడ ఆశ్చర్యపడిరి. అందువలన సిపాయిల విప్లవానంతరము రాణీ ప్రభుత్వమున క్రొత్త పరిస్థితులలో శాంతిస్థాపన సందర్భమున నీతనికి సి. ఎస్. ఐ. అను నొక బిరుదునిచ్చి క్రొత్తశాసనసభలో నొక సభ్యునిగా చేసిరి. ఇతడు బిరుదు నందినంతమాత్రమున ప్రభుత్వ వ్యామోహమునబడి వారి కనుకూలముగా ప్రవర్తించు స్వార్థపరుడుగాడు. స్వధర్మరక్షణకొరకు దీక్షవహించి దేశ ప్రజల హక్కులను కాపాడుటయె తన ధర్మముగ నెంచుకొని ఎప్పటివలెనె ప్రజాసేవ చేయుచు ప్రభుత్వచర్యలు అక్రమము లైనప్పుడు వాని నతితీవ్రముగా విమర్శింపసాగెను. ఈతడు చేయుచుండిన నిరంతర కృషివలననీతనికి గొప్ప రాజకీయపరిజ్ఞానమును రాజ్యతంత్ర నిపుణతయు నలవడినవి. ఆశక్తులెల్ల తన తోడిప్రజల క్షేమలాభములకొరకు వినియోగింపసాగెను. బ్రిటీషు పరిపాలనలోచేరిన మన రాజధానిలోని ప్రజల కష్టసుఖములనే గాక నాడు బ్రిటీషువారితో సంబంధము గలిగియుండిన మన రాజులయొక్కయు నవాబులయొక్కయు క్షేమలాభములకొరకు గూడ నీతడు పాటుపడసాగెను. ఆసందర్భములో నీతడు నేటి