పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ణములను చేయకపోయినను కొన్ని చిన్న సంస్కరణములను మాత్రము చేసిరి. తృప్తికరముగ పనిచేయుచుండని సదరు కోర్టులను తీసివేసి హైకోర్టులు స్థాపింపబడునట్లు ఏర్పాటుచేసిరి. ఆశ్రయించువారికెల్ల ఉద్యోగములిచ్చు పద్దతిని మాన్పి పరీక్షలందు తేరినవారికి మాత్రమే ఇవ్వవలెనని శాసించిరి.

కంపెనీవారు మరల రాజ్యాధికారపట్టా పొంది ఎప్పటివలెనే తమ దుష్పరిపాలనమును నిరంకుశముగ చలాయింపసాగిరి. దేశమునందు అసంతృప్తి హెచ్చెను. ఆశాభంగము కలిగెను. కాని లక్ష్మీనర్సుగారును, ఆయన కీ ఆందోళమునందెల్ల తోడునీడయై పనిచేయుచున్న నార్టన్ గారును, నిరాశజెందక ధైర్యముతోను ద్విగుణీకృతమైన పట్టుదలతోను రాజకీయ నంస్కరణములకొరకు పనిచేయసాగిరి. నార్టన్ గారు కంపెనీవారి దుష్పరిపాలనా ఫలితముగా గలిగిన దేశదారిద్ర్యమును అజ్ఞానమును గూర్చిన లెక్కలతోను ప్రత్యక్ష ప్రమాణములతోను కొన్నివందలు పుటలుగల గొప్పనివేదికను తయారుచేసి వివిధజిల్లాలలో జరిగిన అన్యాయములను వివరించి భారతదేశప్రజలు రాజకీయహక్కులకు తగరనియు కంపెనీ పరిపాలనము బాగుగనే యున్నదనియు దొరలుచేయుచుండిన అబద్ధపు ప్రచారమును ఖండించుచు కంపెనీ దుష్పరిపాలనా విధానమునెల్ల చక్కగావర్ణించి ఈ పరిపాలనా పద్దతిని వెంటనే రద్దుపరచి ఇంగ్లాండు రాజుక్రింద పార్లిమెంటుమంత్రియే ఈ దేశప్రభుత్వమునకు బాధ్యతవహించి ప్రభుత్వము స్థాపించవలసినదని పార్లమెంటును ప్రార్థించుచు 1854 లో